అయ్యా చంద్రబాబు మాకిదేం ఖర్మ…?

-

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో ఇప్పుడు అసహనం కట్టలు తెంచుకుంది. అంటే అవుననే సమాధానం వినబడుతోంది.ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసిపి దూకుడుగా వెళుతుంది. అధికారంలో ఉన్న పార్టీకి అన్ని విధాలుగా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఒక వైపు జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు అధికార యంత్రాంగం మొత్తం వైసిపి కి దాసోహం అయింది.అనే విధంగా ప్రజల్లో కూడా ఒక రకమైన అభిప్రాయాలున్నాయి.

అయితే గత నాలుగు రోజులుగా జరుగుతున్న కొన్ని పరిణామాలు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా ఆందోళనలోకి నెట్టేసే విధంగా ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చంద్రబాబు రాజకీయాన్ని పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు.అసలు నియోజకవర్గాల్లో బలమైన నాయకుల నుంచి పోటీ చేయాలి అనుకునే అభ్యర్థులకు  అవసరమైన మద్దతు లేదని నియోజకవర్గ ఇంచార్జ్ ,పార్టీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు అవసరమైన మద్దతు ఇవ్వటం లేదు.

ఒకవైపు వైసిపి నాయకులు అంత దూకుడుగా వెళుతుంటే వీరు ఇళ్లలో నుంచి కూడా బయటకు రావడం లేదని కనీసం వారితో చంద్రబాబు వాళ్ళతో మాట్లాడి పోటీ చేయించాలి అని అవసరమైన ధైర్యం ఇవ్వకుండా మీడియా సమావేశాలు టెలికాన్ఫరెన్స్ తో సమయాన్ని వృధా చేస్తున్నారు. అనే అభిప్రాయం ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. దీనితోనే చాలా మంది పోటీ చేయాలి అనుకునే అభ్యర్థులు వెనక్కు తగ్గుతున్నారని అంటున్నారు.ఇదే వైఖరి కొనసాగితే భవిష్యత్తులో పార్టీ తరఫున పోటీ చేయడానికి సర్పంచ్ అభ్యర్థులు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదని చంద్రబాబు అర్జెంట్ గా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించి కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయకపోతే లాభం ఉండదని టిడిపి కార్యకర్తలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news