స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం వైసిపి పార్టీ తీవ్రంగా కష్టపడుతుంది. అధికారంలో ఉండటంతో చాలా ప్రాంతాలలో వార్ వన్ సైడ్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల అయిపోయిన తర్వాత మళ్లీ ప్రజా క్షేత్రం నుండి తీర్పు రానున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జగన్. దాదాపు పది నెలల పరిపాలన పై ప్రజల నుండి తీర్పు రాబోతున్న తరుణంలో ప్రతి చోటా బలమైన అభ్యర్థులను నిలబెడుతూ మరోపక్క ప్రత్యర్థి పార్టీల నేతలకు ఎర్ర వేస్తూ వైసీపీ కండువా కప్పే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి గట్టిగా జరుగుతున్న తరుణంలో చాలా వరకూ ఇతర పార్టీలకు చెందిన నాయకులు వైసిపి పార్టీ కండువా కప్పేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా అన్ని చోట్ల బాగానే ఉన్నాయి కానీ విశాఖ మేయర్ పీఠం కోసం జగన్ బాగా కష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా ఇక్కడ గెలవాలని జగన్ ప్రయత్నిస్తున్న తరుణంలో మరో పక్క విశాఖ మేయర్ పీఠం మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం విశాఖపట్టణానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం అన్ని విజయసాయిరెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ తరుణంలో వైజాగ్ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రం అమరావతి మాదిరిగా వైజాగ్ ప్రాంతాన్ని నాశనం చేస్తారేమో అన్నా భయాందోళనలో ఉన్నారు అనే టాక్ బలంగా ప్రస్తుతం వినబడుతుంది. దీంతో కచ్చితంగా విశాఖ మేయర్ పీఠం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు టాక్.