హైదరాబాద్‌ను ఆ ప్రాంతంగా మారుస్తారా..?

Join Our Community
follow manalokam on social media

బీజేపీ ప్రభుత్వం మున్ముందు భాగ్యనగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తుందని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు. లోక్‌సభలో శనివారం జమ్మూకశ్మీర్‌ విభజన చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా అసదుద్దీన్‌ మాట్లాడారు. ముంబయి. లఖ్‌నవూ బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నైలను కేంద్ర ప్రాంతాలుగా మార్చడమే బీజేపీ లక్ష్యమని.. దీనికోసం కశ్మీర్‌ను ఉదాహరణగా చూపించారన్నారు. దీన్ని చూసి సంకలు గుద్దుకున్న సెక్యూలర్‌గా చెప్పుకుంటున్న కొన్ని పార్టీలు ఆ తర్వాత బాధా పడటం ఖాయమన్నారు. ఇప్పుడెవరైతే ప్రభుత్వానికి మద్దతిచ్చారో, భవిష్యత్‌తో జరిగే పరిణామాలకు ఎదుర్కొవాల్సి వస్తోందని సూచికలిచ్చారు.

అమెరికా ఒత్తిడితోనే 4జీ..

అమెరికా ఒత్తిడితోనే జమ్మూకశ్మీర్‌లో 4జీ సౌకర్యం కల్పించారని, ఆ ప్రాంతం ప్రజలపై దయతలచి ఇవ్వలేదన్నారు. జమ్మూ సమస్యను అంతర్జాతీయం చేయడంతో అక్కడి వారిలో మరింత అసంతృప్తి నెలకొంటుందన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిస్తే రాష్ట్రహోదా ఇస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు వెనక్కి తగ్గుతుందన్నారు. 2011 లెక్కల ప్రకారం ముస్లింలు 68.37 శాతం, హిందువులు 20 శాతం ఉన్నారు.

ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ఆ రాష్ట్రంలో ఆయా శాఖల్లో ఆ వర్గాల అధికారులు చాలా తక్కువగా ఉన్నారని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌లో మైనారీ శాఖకు రూ. 5,209 కోట్లు కేటాయించి సవరింపు పేరుతో రూ.1,024 కోట్లు తగ్గించి కేవలం రూ.4,005 కోట్లతో సరిపెట్టారని ఓవైసీ ట్వీట్‌ చేశారు.
కేంద్ర వైఖరితో రాజ్యసభలో ఒక కశ్మీరీ పార్లమెంటేరియన్‌ లేకుండా చేశారని ఎంపీ అసదుద్దీర్‌ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

TOP STORIES

బిజినెస్ ఐడియా: మహిళలు ఇంట్లోనే ఇలా సంపాదించవచ్చు..!

చాలా మంది మహిళలు నేటి కాలంలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ల కోసమే ఈ బిజినెస్ ఐడియాస్. వీటిని అనుసరిస్తే మీరు ప్రతి నెలా మంచి...