తెలంగాణలో మళ్లీ కొన్ని రోజుల్లో ఉప ఎన్నికల జోరు పెరగనుంది. కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్ నగర్ ఎమ్మెల్యే. దీంతో రెండింట్లో ఏదో ఒక పదవికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. దీంతో హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల అనివార్యం అయింది.
ఈసారి కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేస్తారని తెలుస్తుండగా.. టీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీ చేస్తారని తెలుస్తోంది. అంటే ఈసారి కవిత వర్సెస్ పద్మావతి.. ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. కవిత.. హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటూ.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. దీనిపై ఇంకా ఏ పార్టీ నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు.