రాజ్‌నాథ్ సింగ్‌తో ఎంపీ ర‌ఘురామ భేటీ.. అందుకేనా?

ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. మొన్నటి వ‌ర‌కు బెయిల్ వ‌చ్చినా.. విడుద‌ల‌కు ఆలస్యం అయింది. ఎక్క‌డ పోలీసులు మ‌ళ్లీ అరెస్టు చేస్తారేమో అని ఆయ‌న ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఇక అక్క‌డి నుంచి విడుద‌లై ఢిల్లీలోనే ఉంటున్నారు.

ఈ రోజు ఉద‌యం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన ఎంపీ.. త‌న‌ను అరెస్టు చేసిన స‌మ‌యంలో నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కోరారు. అది జ‌రిగిన కొద్ది గంట‌ల‌కే ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు.

దాదాపు 10 నిమిషాలపాటు రఘురామరాజు రాజ్‌నాథ్‌తో సమావేశం జ‌రిపారు. ఇటీవల జరిగిన పరిణామాలపై ఇరువురు చర్చించారు. జ‌గ‌న్ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని రాజ్‌నాథ్‌కు రఘురామ ఫిర్యాదు చేశారు. సీఐడీ కేసుల గురించి కూడా చ‌ర్చించారు. అయితే గాయాల కార‌ణంగా ఆయ‌న వీల్ చైర్‌లోనే రాజ్ నాథ్ సింగ్ ఇంటికి వెళ్లారు. ఇప్ప‌టికే ఆయ‌న‌కు అండ‌గా ఉంటున్న బీజేపీ.. ఇప్పుడు కేసుల విష‌యంలో కూడా అండ‌గా ఉండాల‌ని ఎంపీ కోరిన‌ట్టు తెలుస్తోంది. అందుకోస‌మే ఆయ‌న బీజేపీ పెద్ద‌ల‌ను క‌లుస్తున్నారు.