భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ. అటువంటి ముఖేష్ అంబానీ కి కుడి భుజం లాంటివాడు పరిమళ నీడ నత్వాని. అటువంటి నీడ నత్వాని కి ముఖేష్ అంబానీ కోరికమేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్యసభ సీటు ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ముఖేష్ అంబానీ స్పందించకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేవలం రాష్ట్రం నుండి పదవులు తీసుకోవటం తప్పా రాష్ట్రాన్ని కాపాడే ఉద్దేశం ముఖేష్ అంబానికి లేదా అంటూ చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.విభజనతో మరియు గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రస్తుత పరిస్థితి తీవ్రంగా కరోనా వైరస్ దెబ్బకి కాకా విఫలమయ్యింది. అటువంటి రాష్ట్రం నుండి తాను నమ్మిన బంటు రాజ్యసభకు పంపించిన జగన్ సర్కార్ కి ముకేశ్ అంబానీ ఏదో రూపంలో ఆదుకోవాలని… చాలా మంది ప్రముఖులు విరాళాలు ప్రకటించిన తరుణంలో ముకేశ్ అంబానీ కూడా అదే స్థాయిలో భారీ విరాళం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం రాష్ట్రం నుండి పదవుల బెనిఫిట్ పొందటం తప్పా ఆదుకునే ఉద్దేశం ముకేశ్ అంబానీ కి లేదా అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు.
ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంబానీ నుండి ఎటువంటి సహాయం రాకపోవడంతో చాలామంది అంబానికి మరియు అడుక్కునేవాడికి ఇద్దరి మధ్య తేడా లేదని ఫస్ట్ టైం అనిపించింది అంటూ కొంతమంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంబానీ నిజంగా సీరియస్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటే అందుకే చాలా వరకు ఆర్థిక భారం ప్రభుత్వానికి తగ్గుతుందని కొంతమంది రాజకీయ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.