మునుగోడు పోరు: సైలెంట్‌గా సెట్ చేస్తున్న కోమటిరెడ్డి..!

-

మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పనిచేస్తున్నారు. ఒకవేళ ఓడిపోతే కోమటిరెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే ఈ ఉపఎన్నిక తీసుకొచ్చిందే కోమటిరెడ్డి కాబట్టి. ఆయన కాన్ఫిడెంట్‌తో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోనే ఉపఎన్నిక వచ్చింది. బీజేపీలో చేరిన ఆయన గెలిస్తే ఇబ్బంది లేదు. పొరపాటున ఓడిపోతే మాత్రం ఇంకా అంతే సంగతులు.

వాస్తవానికి ఈ ఉపఎన్నికని ఎవరూ ఊహించలేదు. అనూహ్యంగా బీజేపీ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన కోమటిరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోనే ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఉపఎన్నికని అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా గెలిచి తీరాలనే కసితో అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్‌లు పనిచేస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టి సత్తా చాటాలని బీజేపీ చూస్తుంది.

అయితే ఇక్కడ పార్టీల పరంగా జరిగే రాజకీయం జరుగుతుంది. కానీ నేతల పరంగా చూస్తే ఇది కోమటిరెడ్డికి చాలా ముఖ్యం. పార్టీల గెలుపోటముల పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ కోమటిరెడ్డి ఓడిపోతే..ఆయన కెరీర్‌కే రిస్క్. అందుకే ఖచ్చితంగా గెలిచి తీరాలని పకద్భందిగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తనతో పాటు కొందరు నేతలని, కార్యకర్తలని బీజేపీలోకి తీసుకొచ్చి..తన బలాన్ని మరింత పెంచుకున్నారు. ఇక వ్యక్తిగతంగా కోమటిరెడ్డికి ఫాలోయింగ్ ఉండనే ఉంది. అది కొంత లాభం చేకూరుస్తుంది.

కానీ గెలవడానికి ఇది సరిపోదు..ఇంకా బలం పెంచుకోవాలి..మెజారిటీ స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులని లాగడమే కాదు. టీఆర్ఎస్ వ్యతిరేత ఓట్లని దక్కించుకోవాలి. అలాగే టీఆర్ఎస్ నేతలని కూడా లాగాలి. ఇప్పటికే కొందరిని పార్టీలోకి తీసుకొచ్చారు. తాజాగా చండూరు మండల జడ్పీటీసీ సభ్యుడు కర్నాటి వెంకటేశం టీఆర్ఎస్‌ని వీడి కోమటిరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఇలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళితే కోమటిరెడ్డికి అడ్వాంటేజ్ అవుతుంది..గెలుపుకు దగ్గర అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news