మునుగోడులో ముక్కోణపు పోటీ! విజయం ఎవరిని వరిస్తుందో?

-

తెలంగాణ లో ఈసారి ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బిఆర్ఎస్ భావిస్తుంటే, బిఆర్ఎస్ కు చెక్ పెట్టి తమ సత్తా చాటాలని కాంగ్రెస్, బిజెపి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గము హాట్ టాపిక్. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కీలక నేత పోటీ చేస్తుంటే వారి గెలుపు ఆ పార్టీలకు కీలకంగా మారిందని చెప్పవచ్చు. అటువంటి నియోజకవర్గాలలో ముఖ్యమైనది మునుగోడు. మునుగోడు నియోజకవర్గం లో గెలుపు కోసం మూడు పార్టీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి.

మునుగోడులో మూడు పార్టీలు బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా ఒకే సామాజిక వర్గం వారిని బరిలోకి దింపాయి. బిజెపి నుంచి చలమల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బిఆర్ఎస్ నుండి  ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈసారి పోటీ బిఆర్ఎస్ కన్నా బిజెపి, కాంగ్రెస్ మధ్యపోటీ ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నియోజకవర్గంలో బిజెపి, కాంగ్రెస్ మధ్య రసవత్తర పోరు నడుస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి బిజెపికి మారిన చలమల కృష్ణారెడ్డికి బిజెపి టికెట్ ఇవ్వగా, బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికే తన మద్దతు ప్రకటించింది. కానీ ఈసారి మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి కి నియోజకవర్గంలో ఉన్న పట్టు తో పాటు, కాంగ్రెస్ కు నియోజకవర్గంలో పట్టు పెరగడంతో ఈసారి మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా. రసవత్తర పోరు మధ్య రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ మూడు పార్టీల మధ్య ముక్కోణపు పోరు హోరాహోరీగా జరిగే ఛాన్స్ ఉంది. ఈపోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news