లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.. బాలకృష్ణకు ట్విస్ట్ ఇచ్చిన ఆర్జివి..!

-

రాం గోపాల్ వర్మ ఏ పని చేసినా సరే దానికి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది. అతను చేసే సినిమాల కన్నా వాటిని ప్రమోట్ చేసే అంశాలు ప్రేక్షకులకు ఆసక్తిగా అనిపిస్తాయి. ఇక లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా విషయంలో అసలు వర్మ ఏం చెప్పబోతున్నాడు. జరిగిన వాస్తవాలు ఏంటి అన్నది సినిమాగా చూపిస్తాడని అంటున్నారు. ఇదిలాఉంటే శుక్రవారం జరిగిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాను బాలకృష్ణకు అంకితం ఇస్తున్నా అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అసలే ఎన్.టి.ఆర్ బయోపిక్ గా బాలయ్య చేసిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఫ్లాప్ అవగా ఆ సినిమాల వైఫల్యాన్ని దిగమింగలేని పరిస్థితుల్లో ఉన్న బాలయ్యకు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంకితం అని చెప్పడం అందరిని ఆశ్చర్యపరచింది. అప్పట్లో ఈ సంఘటనలు జరిగినప్పుడు తాను రంగీలా షూటింగ్ లో ఉన్నానని.. అప్పటి మీడియా వారి దగ్గర.. కొంతమంది రాజకీయనాయకులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఈ సినిమ తీశానని చెప్పారు వర్మ. అంతేకాదు సినిమా వాస్తవానికి దగ్గరగా తీశానని అని చెప్పుకొచ్చాడు వర్మ. లక్ష్మీ పార్వతి గెస్ట్ గా వచ్చిన ఈ ఈవెంట్ లో థర్టీ ఇయర్స్ పృథ్వి, పోసాని కృష్ణమురళి చేసిన హాట్ కామెంట్స్ చర్చాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news