బాబు అరెస్ట్‌పై ‘నేషనల్’ ఫోకస్.!

-

తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశం ఉలిక్కిపడేలా 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు, 14 ఏళ్ల అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని..ఏపీ సి‌ఐ‌డి అరెస్టు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ లో స్కాం జరిగింది అని, ఆ స్కాం చంద్రబాబు హయాంలో జరిగిందని చంద్రబాబును అరెస్ట్ చేశారు. కానీ చంద్రబాబు పాత్ర కచ్చితంగా ఉందని గాని, చంద్రబాబు వలన జరిగిందని గాని ఖచ్చితమైన సమాచారం లేదు. చంద్రబాబును అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి అనే సంకల్పం తప్ప వేరే ఉద్దేశ్యమే లేదని టి‌డి‌పి అనుకూల వాదులు అంటున్నారు.

ఈ విషయం పక్కన పెడితే బాబు అరెస్ట్ పై జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలు బాబు అరెస్ట్‌ని ఖండించారు. ఈ అరెస్ట్‌ని బి‌జే‌పికి ఆపాదిస్తూ..బి‌జే‌పిపై ఫైర్ అవుతున్నారు. ఇక ఇదే సమయంలో నేషనల్ మీడియాలో కూడా బాబు అరెస్ట్ అంశం మోతమొగుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని మీడియా సంస్థల్లో ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారనే అంశం ఎక్కువ హైలైట్ అవుతుంది.

ఈ క్రమంలోనే ఒక నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వైసీపీ నాయకుడు చెప్పిన సమాధానం వింటే కచ్చితంగా కక్షపూరితంగానే చంద్రబాబు అరెస్టు జరిగిందని సామాన్యులకు సైతం అర్థమవుతుందని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారు అని యాంకర్ ప్రశ్నించగా, ఆ వైసీపీ నాయకుడు ఆధారాల సేకరణలో సిఐడి, పోలీసులు ఉన్నారని, త్వరలో వాటిని సేకరిస్తుందని చెప్పాడు.

అంటే ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని టి‌డి‌పి శ్రేణులు..ఆ మీడియాకు సంబంధించిన న్యూస్‌ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news