ఫోన్ లీకుల‌తో వైసీపీ మంత్రుల‌కు కొత్త చిక్కులు..

అదేంటో గానీ ఈ మ‌ద్య రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీఆర్ఎస్‌ను, వైసీపీ మంత్రుల ఫోన్ లీక్ లు బాగా వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇవి మంచి ప‌నుల‌కు సంబంధించిన‌వి అయితే బాగానే ఉండేది కానీ ప్ర‌భుత్వానికి మ‌చ్చ తీసుకువ‌చ్చే ప‌నుల‌కు సంబంధించిన‌వి కావ‌డంతో రెండు పార్టీలు ఇబ్బందులు పెడుతున్నాయి. వీటిని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే ఎవ‌రో ప్లాన్ చేసిన‌ట్టు ఇలా మంత్రుల ఫోన్ లీకులు కావ‌డంతో సంచ‌ల‌నం రేపుతోంది. ఈ ఫోన్ లీకులు మ‌రీ ముఖ్యంగా వైసీపీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే లాగా ఉండ‌టంతో జ‌గ‌న్ వ‌ర‌కు కూడా వెళ్తున్నాయంట‌.

ప్ర‌స్తుతం మ‌రో మంత్రి ఫోన్ లీక్ కావ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను దుమారం రేపుతోంది. మంత్రి గుమ్మనూర్ జయరామ్ రీసెంట్ గా మాట్లాడిన మాట‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఏపీలో ప్ర‌స్తుతం ఏపీలో సుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. ఎవ‌రికీ ప‌ర్మిష‌న్ ఇవ్వ‌ట్లేదు. ఈ క్ర‌మంలో మంత్రి ఇసుక అక్రమ రవాణాను స‌పోర్టు చేస్తున్న‌ట్టు ఓ పోలీస్ ఆఫీస‌ర్ తో మాట్లాడ‌టంతో వైసీపీకి కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. ఇల్లీగల్ గా ప్రుభుత్వం ఇసుక ర‌వాణా వద్దని చెప్తూనే ఇలా అధికార పార్టీ మంత్రులు ఎంక‌రేజ్ చేస్తున్నారంటూ టీడీపీ మండిప‌డుతోంది.

ఇందులో ఆయ‌న ఓ ఎస్ఐ మాట్లాడుతూ ప‌ట్టుకున్న ఇసుక అక్ర‌మ ర‌వాణా ట్రాక్టర్లను వెంట‌నే వదిలేయాలంటూ ఆవేశంగా మాట్లాడారు. లేదంటే కార్య‌క‌ర్త‌ల‌తో స్టేష‌న్‌కు వ‌చ్చి ధర్నా చేస్తామంటూ చెప్ప‌డం సోషల్ మీడియాలో విప‌రీతంగా వైరల్ అవుతోంది. దీంతో జిల్లాలోని ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమంటున్నాయి. మంత్రి స్థాయిలో ఉండి అక్ర‌మాల‌ను ఎంకరేజ్ చేస్తారా అంటూ ప్ర‌తిప‌క్ష నేత‌లు వాపోతున్నారు. ఇది ఇప్పుడు టీడీపీకి మంచి సాకుగా మారిపోయింది. రాష్ట్రంలో ఏం జ‌రుగుతుందో ఇది వింటేనే తెలుస్తుంద‌ని వారు అప్పుడే ప్ర‌చారం మొద‌లు పెట్టేస్తున్నారు.