బాబుకు కొత్త ఆయుధం..వైసీపీ తిప్పికొడుతుందా?

-

ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా…ఎప్పుడు అధికార పక్షాన్ని ఇరుకున పెడదామా? అని ప్రతిపక్ష పార్టీ చూస్తూనే ఉంటుంది…ఛాన్స్ దొరికితే చాలు అధికార పార్టీని నెగిటివ్ చేసి…తమ బలాన్ని పెంచుకోవాలని అనుకుంటుంది. అయితే ప్రతిపక్షానికి గట్టిగా కౌంటర్లు ఇవ్వగలిగితేనే అధికార పార్టీ ప్రజల్లో నిలబడగలుగుతుంది…లేదంటే ప్రతిపక్షానికే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ పెంచుకోవడం కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు.

అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి అధికారంలో ఉన్న వైసీపీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా బాబు రాజకీయం చేస్తూ…జగన్ ప్రభుత్వంపై నెగిటివ్ పెంచే కార్యక్రమాలు చేస్తున్నారు…అలాగే టీడీపీ బలాన్ని పెంచుతూ వస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు చంద్రబాబుకు వైసీపీ కౌంటర్లు ఇస్తూనే ఉంది…దాని వల్ల చంద్రబాబు సృష్టించే నెగిటివ్ ప్రభావం వైసీపీపై ఎక్కువ పడటం లేదు.

అయితే తాజాగా చంద్రబాబుకు వైసీపీని ఇరికించే ఆయుధాలు బాగానే దొరుకుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలపై పెరిగిన వ్యతిరేకత టీడీపీకి ప్లస్ అవుతుంది..అలాగే సరైన అభివృధ్ది లేకపోవడం…రోడ్లు దారుణంగా దెబ్బతినడం..ప్రజలపై పన్నుల భారం పెంచడం లాంటి వాటిపై బాబు గట్టిగానే పోరాడుతున్నారు. ఇదే క్రమంలో గోదావరి వరదలు సైతం..వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. సీఎం జగన్ ఏమో హెలికాప్టర్ లో తిరిగేసి వెళ్ళిపోయి…ఏదో బాధితులకు అరకొర సాయం అందించే కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే బాబు ఇప్పుడు వరద ప్రాంతాల్లో పర్యటించి జగన్ ప్రభుత్వ వైఫల్యాలని బయటపెట్టడానికి రెడీ అయ్యారు.

అదే సమయంలో ఏపీ పరిమితికి మించి అప్పులు చేసిందని, ఏపీలో శ్రీలంక పరిస్తితులు వచ్చే అవకాశం ఉందని కేంద్రం తాజాగా చెప్పుకొచ్చింది. అసలే ఛాన్స్ దొరికితే జగన్ ప్రభుత్వాన్ని ఆడేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు..ఈ క్రమంలో కేంద్రం ప్రకటన బాబుకు ఆయుధంగా మారింది…దీని ద్వారా వైసీపీపై ఇంకా విరుచుకుపడుతున్నారు. ఏపీ మరో శ్రీలంక అని కామెంట్ చేస్తున్నారు. దీని వల్ల వైసీపీపై నెగిటివ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి…మరి బాబు రాజకీయాన్ని వైసీపీ సమర్ధవంతంగా తిప్పికొడుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news