మొర వినే నాధుడే లేడు .. కాపాడే బంధువూ రాడు .. పత్రిక రంగం కన్నీళ్లు !

-

ప్రభుత్వం నుండి ప్రజలకు చేరవేసే విషయంలో అప్పట్లో పత్రికారంగం చాలా కీలకంగా ఉండేది. అయితే రాను రాను టెక్నాలజీ పెరగటం ఎలక్ట్రానిక్ మీడియా రావటం తో పాటుగా ఇప్పుడు సోషల్ మీడియాలో రావటంతో పత్రికారంగం డేంజర్ జోన్ లో పడింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది. పత్రికా రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు యాజమాన్యాలు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదట. దీంతో చాలా వరకు పత్రికలు మూత పడటానికి రెడీ అయ్యాయి.TELUGU NEWSPAPERSఒకానొక సమయంలో ప్రజలకు మరియు ప్రభుత్వాలకు మధ్య పత్రికారంగం వారధిగా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి అనేది ప్రజలకు పత్రిక చదివితేగాని తెలిసేది కాదు. అటువంటిది ప్రస్తుతం లైవ్ లు మరియు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లు అందుబాటులోకి రావటంతో ప్రజలు ఎవరూ పత్రికా రంగాన్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా 3g, 4g టెక్నాలజీ వచ్చాక స్మార్ట్ ఫోన్ లు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాక న్యూస్ పేపరు చదవటం చాలామంది మానేశారు.

 

దీంతో ప్రస్తుతం పత్రికారంగం మొత్తమంతా మూత పడటానికి రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో పత్రిక రంగాన్నే నమ్ముకున్న యాజమాన్యాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మా మొర వినే ప్రభుత్వాలు కూడా లేవు అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. మరికొన్ని పత్రికలు అయితే పార్టీల ఫేవర్ గా ఉంటూ నెట్టుకొచ్చేస్తున్నాయి. దీంతో ఉన్నది ఉన్నట్టు చూపించే పత్రికల పరిస్థితి ఇప్పుడు చాలా ప్రమాదకర స్థితిలో పడింది. 

Read more RELATED
Recommended to you

Latest news