వివాదం ముదురుతోంది .. నిమ్మగడ్డ vs కనగరాజ్ గా తయారు అవుతోంది !

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. తనని పదవినుంచి ఉద్దేశపూర్వకంగా ఏపీ ప్రభుత్వం తొలగించిందని నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. చట్టపరంగా తన తొలగింపు సరైనది కాదని రూల్ 2 ప్రకారం  రాజ్యాంగ విరుద్ధమని నిమ్మగడ్డ న్యాయస్థానంలో పిటిషన్ వేయడం జరిగింది. ఇదే సమయంలో 74 ఏళ్ల వ్యక్తి నీ ఎన్నికల కమిషనర్ గా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని తన పిటిషన్ లో తెలిపారు. దీంతో ముందు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ పని నడుస్తున్న మ్యాటర్ లోకి సడన్ గా నూతన ఎన్నికల కమిషనర్ వి.కనగరాజ్ ఎంట్రీ ఇచ్చారు.Justice Kanagaraj Takes Charge As New State Election Commissioner ... నిమ్మగడ్డ వేసిన పిటిషన్ కి ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ తో పాటు తాజాగా కనగరాజ్ కూడా కౌంటర్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ తో పాటు దాఖలైన 12 పిల్స్ కు ఒకే కౌంటర్ దాఖలు చేశారు. ఓటరు, అభ్యర్థి కాకుండా SEC అర్హతలపై ఎలా దాఖలు చేస్తారని కనగరాజ్ ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మినహా మిగతా వారికి పిల్ దాఖలు చేసే అర్హత లేదని కనగరాజ్ న్యాయస్థానానికి తెలిపారు. గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ ను పిటిషనర్ లు ప్రశ్నించలేరని కౌంటర్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆర్డినెన్స్ ద్వారా తొలగించాక నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమిషనర్ హోదాలో పిల్ ఎలా వేస్తారని కనగరాజ్ ప్రశ్నించారు.

 

స్థానిక ఎన్నికలపై దాఖలైన ఫిర్యాదు లో ఒక్క శాతం కూడా లేవన్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా కోసం నిమ్మగడ్డ ఎవరిని సంప్రదించలేదని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రహస్యమని అన్న నిమ్మగడ్డ వాదన లో పస లేదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ నియమావళికి గవర్నర్ కి అన్ని అధికారాలు ఉన్నాయని అన్నారు. చట్టంలో మార్పులతో నిమ్మగడ్డ పదవి కోల్పోయారు ఆయనని ప్రభుత్వం తొలగించ లేదని కనగరాజ్ తన పిటిషన్ లో  చెప్పుకొచ్చారు. తాజా పరిస్థితుల వల్ల వివాదం మొత్తం నిమ్మగడ్డ వర్సెస్ కనగరాజ్ గా తయారు అవుతోంది. 

Read more RELATED
Recommended to you

Latest news