తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గర పడుతుంది. గ్రామీణ ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో, పట్టణ ఓటర్లు ఎవరి వైపు చూస్తారో అని రాజకీయ నాయకులందరూ ఆలోచిస్తున్నారు. ఆ ప్రాంతాలలో పట్టున్న నేతలని తమ అభ్యర్థులుగా ప్రకటించి, విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటరు నాడిని తెలుసుకొని మరి తమ అభ్యర్థి గెలుపు కోసం పాటుపడుతున్నారని చెప్పవచ్చు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కొంచెం ప్రత్యేకమైనది. ఈ నియోజకవర్గంలో మొత్తం పట్టణ ప్రాంత ఓటర్లే ఉన్నారు. వీరు ఎవరికి ఓటు వేస్తారో అన్నది మాత్రం ఎవరికీ అంత చిక్కటం లేదు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ అభ్యర్థిగా బిగాలా గణేష్ గుప్తాను నిలబెట్టారు. ఇతను ఎప్పటికీ రెండుసార్లు గెలిచారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇతనికి మంచి పట్టు ఉంది. అంతే కాకుండా బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా ఇతని గెలుపుకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ తరపున షబ్బీర్ అలీని నిలబెడుతున్నారు. ఇతను కాంగ్రెస్ సీనియర్ నేత. ఇతను ఇప్పటివరకు ఓటమినే చూశారు. ఈసారైనా నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ అనుకూల గాలి వేస్తున్న తరుణంలో విజయం సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి నుంచి ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త పేరును ప్రకటించారు. ఇతను గతంలో బిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి మారిన ఈ నేతకు అనూహ్యంగా బిజెపి టికెట్ దక్కింది. నిజామాబాద్ అర్బన్ లో బిజెపికి అనుకూల ఓట్లు ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు.
నిజామాబాద్ అర్బన్ లో త్రిముఖ పోరు హోరాహోరీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఎన్నికలవేళ ఓటర్లు ఏ పార్టీ వైపు చూస్తారు వేచి చూడాల్సిందే….