గ్రేటర్ ఎమ్మెల్యేల ఫిర్యాదులు.. ఈ కార్పోరేటర్లకు మళ్లీ సీట్లు కష్టమే

-

గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల్లో ఎంతమంది సిట్టింగ్ కార్పొరేటర్లకు ఈ సారి టిక్కెట్ మిస్సవుతుందా? గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలన్న టీఆర్‌ఎస్‌ అలోచనకు తోడు.. పలువురు కార్పోరేటర్ లపై ఎమ్మెల్యేల అభ్యంతరాలతో మళ్లీ చాన్స్ వచ్చేది ఎంత మందికి ఈ టెన్షన్ ఇప్పుడు సిట్టింగ్ లలో దడ పుట్టిస్తుంది. టిక్కెట్లు మిస్ అయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందా అని ఇప్పుడు తమలో తాము చర్చించుకుంటున్నారు సిట్టింగ్ కార్పోరేటర్లు.

గ్రేటర్ హైదరబాద్ ఎన్నికలకు అధికార టిఆర్ఎస్ సిద్దమవుతోంది. మరోసారి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న గులాబీ పార్టీ.. ఈసారి గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలనుకుంటోంది. అందుకే పార్టీ కార్పోరేటర్ల పనితీరుపై ఆరా తీస్తోంది. గ్రేటర్ పరిధిలోని 18 నియెజకవర్గాలకు రెండు నెలల క్రితం ఇంచార్జీలను నియమించిన టిఆర్ఎస్ … కార్పోరేటర్ లపై ప్రజల్లో ఉన్న ఫీడ్ బ్యాక్ తెలుసుకుంది. నివేదికలు …సర్వేల ఆధారంగా టిక్కెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనుంది .

15 మంది కార్పోరేటర్ల పనితీరు బాగాలేదని కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో మంత్రి కేటిఆర్ అన్నారు. అప్పటి నుంచి గ్రేటర్ ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్ దక్కుతుంది… ఎవరికి మిస్ అవుతుందన్న చర్చ మొదలైంది. అయితే, గ్రేటర్‌లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో టిఆర్ఎస్ లోతుగా సమాచారం తీసుకుంటోంది. ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నవారికే చాన్స్ ఇవ్వాలని భావిస్తోంది.

కేటీఆర్‌ నిర్వహిస్తున్న సమావేశాల్లో గ్రేటర్‌ ఎమ్మెల్యేలు తమ నియెజకవర్గాల పరిధిలోని పలువురికి మళ్లీ కార్పోరేటర్లకు మరోసారి అవకాశం ఇవ్వొద్దని కోరినట్టు సమాచారం. పార్టీ నివేదికలు ఒక వైపు… మరోవైపు ఎమ్మెల్యేల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకంటే ఎంత మంది సిట్టింగ్ కార్పోరేటర్ లకు టిక్కెట్ మిస్ అవుతుందోనన్న చర్చ జరుగుతోంది.

టిక్కెట్ల ప్రకటనకు ముందు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికపై సమగ్రంగా సర్వేలు చేయింస్తోంది. రెండు, మూడు నివేదికలను పరిగణలోకి తీసుకుని టిక్కెట్ల పై నిర్ణయం తీసుకోనుంది. మరి సిట్టింగ్‌లో సీటు మిస్సయ్యేవారు ఎంత మందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news