మాధవ్‌కు మద్ధతు కరువు..జగన్ సంచలన నిర్ణయమే!

ఏపీ రాజకీయాల్లో వైసీపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం పెద్ద సెన్సెన్షన్ గా మారిన విషయం తెలిసిందే. ఓ మహిళాతో మాధవ్ న్యూడ్ గా మాట్లాడిన వీడియో కాల్ ఒకటి..తాజాగా బయటపడింది..వీడియో వచ్చిన కొద్ది సమయంలోనే సోషల్ మీడియా, మీడియాలో వైరల్ గా మారింది. ఇలా వీడియో వైరల్ కావడంతో..ఎంపీ మాధవ్ మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు…అది మార్ఫింగ్ చేశారని,ఇదంతా టీడీపీ వాళ్ళ పని అని, టీడీపీ అనుకూల మీడియా పని అని చెప్పి…యథావిధిగా టీడీపీపై ఫైర్ అయ్యారు. అలాగే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన…నిజనిజాలు తేలుతాయని చెప్పారు.

సరే మాధవ్ వీడియో మార్ఫింగ్ చేశారనేది నిజమో కాదో…పోలీసుల విచారణలో తేలుతుంది…కానీ ఈలోపు ఈ వీడియో వల్ల వైసీపీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. పైగా ఈ అంశంపై మాధవ్ ఒక్కరే వచ్చి..ఖండించారు తప్ప..ఏ ఒక్క వైసీపీ నేత కూడా మీడియా ముందుకు రావడమో..లేక సోషల్ మీడియా వేదికగా మాధవ్ వీడియోని మార్ఫింగ్ చేశారని ఖండించలేదు. అలాగే వైసీపీ అనుకూల మీడియాలో కూడా మాధవ్ కు అనుకూలంగా కథనాలు రావడం లేదు. అసలు మాధవ్ వ్యవహారంలో సొంత పార్టీ మద్ధతు గాని, సొంత మీడియా మద్ధతు గాని రావడం లేదు.

దీని బట్టి చూస్తుంటే…మాధవ్ వ్యవహారంలో జగన్ సీరియస్ గా ఉన్నారని అర్ధమవుతుంది..ఇప్పటికే ఆ వ్యవహారం నిజమని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో జగన్…మాధవ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.

అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా…ఎంపీ పదవి నుంచి వైదొలిగేలా జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటారని సమాచారం…ఇలాంటి అంశాలని ఉపేక్షిస్తే లాభం ఉండదని, దీని వల్ల పార్టీకి డ్యామేజ్ జరగొచ్చని జగన్ భావిస్తున్నారట. మొత్తానికి మాధవ్ విషయంలో జగన్ సంచలన నిర్ణయమే తీసుకుంటారని తెలుస్తోంది.