కే‌టి‌ఆర్ పట్టాభిషేకానికి సర్వం సిద్ధం ?

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలను మరియు కార్పొరేషన్లను దాదాపు గెలుచుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Image result for ktr

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు టిఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉండబట్టే ఈ స్థాయిలో తెలంగాణ ప్రజలు ఆదరించారని ఎప్పుడూ ఎటువంటి ఎన్నికలు అయినా కచ్చితంగా ఇదే స్థాయిలో రిజల్ట్స్ రిపీట్ అవుతాయని టిఆర్ఎస్ పార్టీ వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు సరైన రీతిలో అందుతున్నాయని ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నామని వాటిని పరిష్కరించే విధంగా కెసిఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి తలసాని మండిపడ్డారు.

 

కాంగ్రెస్, బీజేపీలు టీవీలు, పేపర్లకే పరిమితం అయ్యాయని విమర్శించారు. వాళ్లు రియాల్టీలోకి రారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు కూడా దొరకలేదన్నారు. టీఆర్ఎస్ మాత్రమే రియాల్టీలోకి వస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉంటుందని మంత్రి అన్నారు. ఎందుకు ఈ విధంగా గెలవటానికి గల ప్రధాన కారణం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అని పేర్కొన్నారు. కేటీఆర్ నాయకత్వం గురించి మాట్లాడుతూ… “ఇతర నాయకుల మాదిరిగా కాకుండా, కెటిఆర్ విస్తృతంగా పనిచేశారు, అనేక ప్రదేశాలలో ప్రచారం చేశారు మరియు ప్రజల విశ్వాసాన్ని పొందటానికి సరైన రాజకీయ వ్యూహాలను రూపొందించారు. అతను అందులో విజయం సాధించాడు.” ఖచ్చితంగా భవిష్యత్తులో కేటీఆర్ ముఖ్యమంత్రి అవటానికి అవకాశాలు ఉన్నాయని అందులో తొందర ఏమి లేదని తలసాని పేర్కొన్నారు. దీంతో తలసాని కామెంట్లు విన్న టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు త్వరలో కేటీఆర్ పట్టాభిషేకానికి రెడీ అవటం గ్యారెంటీ అని అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ విధంగా తన సత్తా చాటడో ఇప్పుడు అదే స్థాయిలో రిజల్ట్ తెచ్చాడని కేటీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.