తెలంగాణ లో వరి ధాన్యం కొనుగోలు అంశం పై పార్లమెంటు వేదిక గా స్పష్టత కావాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు అన్నారు. అప్పటి వరకు పార్లమెంటు లో ఆందోళన చేస్తామని అన్నారు. అలాగే పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ అసభ్యకరం గా మాట్లాడుతున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయమని ఎవరు చెప్పారని బండి సంజయ్ అడుగుతున్నారని అన్నారు.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో చెప్పిస్తావా.. అని కే కేశవరావు ప్రశ్నించాడు. తెలంగాణ నుంచి కేవలం 40 లక్షల టన్నుల వరి ధాన్యం తీసుకుంటామని పీయూష్ గోయల్ చెప్పారని అన్నారు. కానీ తెలంగాణ లో యసంగి లో కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని.. అందు కోసమే కోటి టన్నులు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. యసంగి లో బ్రొకెన్ రైస్ ఎక్కువ రావడం తోనే బాయిల్డ్ రైస్ ఉత్పత్తి అవుతాయని అన్నారు. అసలు కేంద్రం తెలంగాణ నుంచి ఎంత ధాన్యం తీసుకుంటుంది అని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.