తెలంగాణ లో ఇప్పుడు రాజకీయాలు చాలా వేడిమీదున్నాయి. ఒక్కో పార్టీలో ఒక్కో విధమైన అనూహ్య మార్పులు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో సందడి నెలకొంది. కొత్త పార్టీలకు అధ్యక్షులు రావడంతో అందరూ అలర్ట్ అవుతున్నారు. ఎవరికి వారు తమ ఉనికిని కాపాడుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒకే అస్త్రాన్ని ఎంచుకుంటున్నారు. అదే పాదయాత్ర.
ఇక ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా వస్తుండటంతో బీజేపీ బాస్ బండి సంజయ్ అందరికంటే ముందు పాదయాత్ర మొదలెట్టేశారు. తానేం తక్కువ కాదంటూ రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే పాదయాత్ర చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.
ఇక కొత్తగా పార్టీ పెట్టిన షర్మిలమ్మ కూడా నేనేం తక్కువ కాదంటూ అక్టోబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు కమిటీలు కూడా వేస్తోంది. ఇలా వీరంతా వారి వారి పార్టీలకు అధ్యక్షులుగా ఉంటూ పాదయాత్రలు చేస్తే ఓ అర్థం ఉంది. కానీ ఇప్పుడు మరో వ్యక్తి కూడా ఏ పార్టీ లేకపోయినా ప్రజల్లో తనుకన్న ఆదరణను ఆధారంగా చేసుకుని పాదయాత్ర చేయడానికి రెడీ అయ్యారు. ఆయనే పరిచయం అక్కర్లేని తీర్మాన్ మల్లన్న. ఇప్పుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా సెప్టెంబర్‌లో పాదయాత్ర చేసేందుకు అడ్‌హక్ కమిటీలను కూడా వేస్తున్నారు. చూడాలి మరి ఎవరు ప్రజల మనస్సులు గెలుస్తారో.