పొత్తులో ఎత్తులు..పవన్ కవర్ చేస్తున్నారు.!

-

రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  నాలుగో విడత వారాహి యాత్ర  ప్రారంభమైంది. వారాహి యాత్రను అవనిగడ్డ నుంచి ప్రారంభించారు. టిడిపి, జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న సభపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగానే యాత్రకు భారీగా జనం తరలి వచ్చారు. అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభ జనసంద్రమే అయ్యింది. ఏ పార్టీ మీటింగ్ అయినా జన సమీకరణ పార్టీ నాయకులు చేస్తారు, కానీ జనసేన మీటింగ్ కు మాత్రం ఎవరూ పిలవకుండానే జనాలు తరలివచ్చారు.

ఇదే క్రమంలో పవన్ పొత్తుకు సంబంధించి కొన్ని అంశాలు ప్రజలకు వివరించే ప్రయత్నాలు  చేస్తున్నారు. అందులో భాగంగానే టిడిపి తో 2019లో విభేదించడానికి ముఖ్య కారణం ప్రత్యేక హోదా అడగకుండా స్పెషల్ ప్యాకేజీకి టిడిపి అధినేత ఒప్పుకున్నారని, అందుకే టిడిపితో వ్యతిరేకించానని పవన్ అన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, అన్ని విధాల రాష్ట్రం వెనుకకు పోయిందని అందుకే టిడిపితో పొత్తు పెట్టుకున్ననాని పవన్ అన్నారు. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఈ పొత్తును ఏర్పాటు చేసుకున్నామని పవన్ అన్నారు.

పార్టీ కన్నా నాయకుల కన్నా ఈ నేల గొప్పదని, ఈ నేలను కాపాడుకోవడానికి ఎటువంటి త్యాగం చేయడానికి అయినా సిద్ధంగా ఉండాలని పవన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రం అధికార పార్టీ ఎటువంటి తప్పులు చేస్తుందో చూస్తున్నాము కాబట్టి తాము అధికారంలోకి వస్తే అటువంటి పొరపాట్లు చేయకుండా అన్ని వర్గాల వారే అభివృద్ధికి కృషి చేయడానికి ప్రయత్నిస్తామని పవన్ హామీ ఇచ్చారు. అలా చేయాలంటే టిడిపి జనసేన కలిసిన ప్రభుత్వమే చేయగలదని పవన్ అన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి, అందరినీ సంతోషంగా ఉంచటానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని పవన్ ప్రజలకు మాట ఇచ్చారు. పవన్ హామీలకు  మెచ్చి ప్రజలు జనసేన టిడిపిని అధికారంలోకి తీసుకు వస్తారో లేదో వేచి చూడాల్సిందే

Read more RELATED
Recommended to you

Latest news