పవన్ పోటీపై కసరత్తులు..పొత్తులోనే సీటు తేలేది.!

ఏపీలో అటు వైసీపీకి గాని, ఇటు టీడీపీకి గాని కాస్త క్లారిటీ ఉందనే చెప్పాలి..నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలతో వెళ్ళాలి.. ప్రత్యర్ధులకు ఎలా చెక్ పెట్టాలనే అంశాలపై బాగానే కసరత్తు చేస్తున్నారు. కానీ అక్కడ జనసేనకే కాస్త క్లారిటీ లేదనే చెప్పాలి. అసలు పొత్తులో పోటీ చేయాలి.. పొత్తు ఉంటే ఏ పార్టీతో ఉంటుంది..అసలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి..ఎన్ని సీట్లలో గెలుస్తాం..పొత్తు ఉంటే పవన్ కు సీఎం సీటు ఇస్తారా? అసలు పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? ఇలా రకరకాల ప్రశ్నలు జనసేన శ్రేణులని టెన్షన్ పెడుతున్నాయి.

కానీ ఏ ఒక్క అంశంపై క్లారిటీ లేదు. ఇక ముఖ్యంగా పవన్ ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఎవరికి తెలియడం లేదు. జగన్‌కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం అన్నట్లు పవన్‌కు కూడా ఒక కంచుకోట ఉండాలని ఆ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. కానీ అసలు సీటు ఏదో కూడా తెలియడం లేదు. ఇప్పటివరకు భీమవరం, గాజువాక, పిఠాపురం, కాకినాడ, భీమిలి, తిరుపతి…ఇలా ఏదొక సీటులో పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు ఏ సీటులో పోటీ చేస్తారో క్లారిటీ లేదు.

అయితే పవన్ పోటీ చేసే సీటు ఇప్పుడే క్లారిటీ రాదని తెలుస్తోంది..కరెక్ట్ గా ఎన్నికల ముందే ఆయన పోటీ చేసే సీటు తెలుస్తుందని అర్ధమవుతుంది. అది కూడా టి‌డి‌పితో ఉండే పొత్తు బట్టి ఆయనకు సీటు ఖరారు అవుతుందని సమాచారం. అప్పుడే ఆయన రాజకీయ పరిస్తితులని బట్టి సీటు ఫిక్స్ చేసుకుంటారని తెలుస్తోంది.

ప్రస్తుతం జనసేన వర్గాల సమాచారం ప్రకారం..ఆయన భీమవరంలోనే పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక పవన్ కోసం చంద్రబాబు భీమవరంలో టి‌డి‌పి తరుపున తోట సీతారామలక్ష్మీని ఇంచార్జ్ గా పెట్టారు. ఆమె కేవలం డమ్మీ మాత్రమే అని తెలుస్తోంది. అంటే పవన్ దాదాపు భీమవరంలోనే పోటీ చేయవచ్చు. అక్కడ భారీ మెజారిటీతోనే గెలుస్తారని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.