కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలను కొంతమేర తీర్చేందుకు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. అమ్మాయిల కోసం కూడా ఎన్నో పథకాలను తీసుకొచ్చింది.. ఇంట్లో అమ్మాయి పుట్టింది అంటే వారికి కొంత నగదును అందిస్తుంది.. ఈ మేరకు ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి నెల డబ్బులను అకౌంట్ లో వేస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇంట్లో కూతురు ఉంటే ప్రభుత్వం నుంచి ప్రతి నెల రూ.4500 అందుతుందా.. ఈ రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనేక పథకాలకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి…
ఆడపిల్ల ఉన్న ఇళ్లకు నగదును ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నెలకు రూ. 4,500 అందజేస్తామని ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. దీనిపై పీఐబీ వైరల్ అవుతున్న క్లారిటీ ఇచ్చింది…ఇకపోతే పిఐబి ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక ట్వీట్‌లో ఇందుకు సంబంధించిన నిజాన్ని తెలియజేసింది. ‘సర్కారీ వ్లాగ్’ అనే యూట్యూబ్ ఛానెల్ వీడియోలో, ‘కన్యా సుమంగళ యోజన’ కింద కుటుంబాలలో కుమార్తెలు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల రూ. 4,500 ఇస్తోందని పేర్కొంది. ఈ వైరల్ అవుతున్న సందేశం ఫేక్ అని పీఐబీ తేల్చి చెప్పింది.
కేంద్ర ప్రభుత్వం అటువంటి పథకం అమలు చేయడం లేదని మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం.. ఈ పథకం అనేది ఒక వినూత్న ద్రవ్య ప్రయోజన పథకం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల ఉద్ధరణ లక్ష్యంగా ఈ పథకం ఉంది. ఈ పథకం కన్యా సుమంగళ యోజన 2023 కింద ఒక కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లల సంరక్షకులు లేదా తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందిస్తుంది.. దయచేసి ఇలాంటి ఫెక్ న్యూస్ లను నమ్మవద్దని హెచ్చరించింది..
'Sarkari Vlog' नामक यूट्यूब चैनल के एक वीडियो में दावा किया गया है कि जिनके परिवार में बेटियां हैं उन्हें 'कन्या सुमंगला योजना' के तहत केंद्र सरकार हर महीने ₹4,500 दे रही है #PIBFactCheck
➡️ यह दावा फर्जी है
➡️ केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है | pic.twitter.com/D724QS7byI
— PIB Fact Check (@PIBFactCheck) May 2, 2023