మద్యంలో మడత..పవన్ మొదలుపెట్టేశారు..!

-

రాజకీయాల్లో అమలు చేయని హామీలని ఇవ్వకూడదు…ఒకవేళ ఇచ్చిన వాటి అమలకు చిత్తశుద్ధితో పనిచేయాలి..కనీసం పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిన కనీసం…కొంత వరకు అమలు చేయడానికి కృషి చేయాలి…అలా కాకుండా హామీలు విషయంలో మాట తప్పి, మడమ తిప్పితే చాలా ఇబ్బంది. మామూలుగా మాట తప్పడం వల్లే చంద్రబాబు అధికారం కోల్పోయారు. కానీ తాను మాట తప్పను, మడమ తిప్పను అని జగన్ అధికారంలోకి వచ్చారు.

మరి అధికారంలోకి వచ్చాక జగన్ మాట తప్పారా? మడమ తిప్పారా? అంటే పలు హామీల విషయంలో జరిగిందనే చెప్పొచ్చు. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని…అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందనే చెప్పొచ్చు. అయితే మద్యపాన నిషేధం విషయంలో జగన్…పూర్తిగా మాట తప్పారని చెప్పొచ్చు. మద్యపాన నిషేధం అనేది సాధ్యం అవ్వని హామీ…కానీ జగన్…అధికారంలోకి వస్తే అక్కాచెల్లెమ్మలకు కోసం మద్యపాన నిషేధం చేస్తానని అన్నారు.

అయితే అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెబుతూ…వైన్ షాపులని తగ్గించడం, ప్రభుత్వమే షాపులని నడపటం, మద్యం ధరలు భారీగా పెంచితే మద్యం తాగేవాళ్లు తగ్గుతారని చెప్పడం లాంటివి చేశారు. ఇక ఎన్ని చెప్పిన ఆదాయం వస్తూనే ఉంది…మద్యం తాగేవాళ్లు తగ్గడం లేదు…పైగా ప్రభుత్వం పిచ్చి పిచ్చి బ్రాండ్లు అమ్ముతుందనే విమర్శలు తెచ్చుకుంది. ఈ విధంగా మద్యపాన నిషేధంలో మడమ తిప్పుతూ వచ్చారు. కొంచెం కొంచెం అయితే పర్లేదు…కానీ తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏకంగా…తమ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం హామీని లేదని పూర్తిగా అబద్దం చెప్పేశారు.

ఒకవేళ మేనిఫెస్టోలో మద్యం నియంత్రణ అని మార్చుకున్నా సరే…జగన్ చెప్పిన మద్యపాన నిషేధం గురించి జనాలకు తెలుసు…అన్నీ తెలిసి కూడా మంత్రి ప్లేటు ఫిరాయించడంపై విమర్శలు వస్తున్నాయి…ఇప్పటికే దీనిపై టీడీపీ…జగన్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు చేస్తుంది…ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా మొదలుపెట్టేశారు..మద్యం మిథ్య…నిషేధం మిథ్య వైసీపీపై సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి మద్యపాన నిషేధం విషయంలో జగన్ ప్రభుత్వం నవ్వుల పాలయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news