చిరంజీవి ఫెయిల్యూర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

-

ప్ర‌జారాజ్యం పార్టీని త‌న సోద‌రుడు చిరంజీవి స‌రిగ్గా న‌డ‌ప‌లేక‌పోయార‌ని ప‌వ‌న్ అన్నాడు. త‌న అన్న‌కు ఉన్న మెత‌క‌త‌నం, ఒత్తిడి వ‌ల్లే పార్టీని న‌డ‌ప‌లేక దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశాడ‌ని ప‌వ‌న్ తెలిపాడు.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కల్యాణ్‌కు చెందిన జ‌న‌సేన పార్టీ ఎంత‌టి ఘోర ప‌రాజ‌యం పాలైందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ప‌వ‌న్ సీఎం అవుతార‌ని, ఎక్కువ సీట్లు సాధించ‌క‌పోయినా.. క‌నీసం 20-30 సీట్లు సాధించి అయినా స‌రే కింగ్ మేక‌ర్ అవుతార‌ని ఆ పార్టీ నేత‌లు భావించారు. అయితే వారి అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. ప‌వ‌న్ పార్టీకి కేవ‌లం ఒక్క సీటు మాత్ర‌మే వ‌చ్చింది. ఇక ప‌వ‌న్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు.

pawan kalyan sensational comments on his brother chiranjeevi

అయితే ఎన్నిక‌ల్లో దారుణ ఫ‌లితాలు వ‌చ్చినా ఆ ఓట‌మి నుంచి తాను త్వ‌ర‌గానే తేరుకున్నాన‌ని ప‌వ‌న్ అన్నారు. తాజాగా ఆయ‌న ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ.. జ‌న‌సేన పార్టీ దారుణ ఓట‌మి త‌న‌ను, పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌ను బాధించింద‌ని, అయితే ఆ ఓటమి నుంచి తాను త్వ‌ర‌గానే తేరుకున్నాన‌ని, వెంట‌నే పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడాన‌ని ప‌వ‌న్ అన్నారు. కాగా అప్ప‌ట్లో త‌న అన్న, చిరంజీవికి చెందిన ప్ర‌జారాజ్యం పార్టీ కాంగ్రెస్ విలీనం అయిన విష‌యంపై ప‌వ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌జారాజ్యం పార్టీని త‌న సోద‌రుడు చిరంజీవి స‌రిగ్గా న‌డ‌ప‌లేక‌పోయార‌ని ప‌వ‌న్ అన్నాడు. త‌న అన్న‌కు ఉన్న మెత‌క‌త‌నం, ఒత్తిడి వ‌ల్లే పార్టీని న‌డ‌ప‌లేక దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశాడ‌ని ప‌వ‌న్ తెలిపాడు. అయితే తాను అలా కాద‌ని, త‌మ‌కు అంత‌టి దారుణ ఫ‌లితాలు వ‌చ్చాక కూడా తాను పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడాన‌ని, అందుకే తమ పార్టీ మ‌ళ్లీ చురుగ్గా ఉంద‌ని, అయితే అదే ప‌ని అప్ప‌ట్లో చిరంజీవి చేసి ఉంటే ఇప్ప‌టికీ ప్ర‌జారాజ్యం పార్టీ బ‌తికే ఉండేద‌ని ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశాడు. అయితే చిరంజీవిపై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు మెగాఫ్యాన్స్ ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news