రాజకీయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెద్దగా బలపడటం లేదనే చెప్పాలి. పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు అవుతున్నా సరే జనసేన పికప్ కావడం లేదు. ఏపీలో జనసేనకు స్పేస్ దొరకడం లేదు. అయితే టీడీపీ లేకపోతే వైసీపీ అన్నట్లు పరిస్తితి ఉంది. ఆ రెండు పార్టీల మధ్య జనసేనకు ఏ మాత్రం ఛాన్స్ రావడం లేదు. అవకాశాలు వచ్చినా సరే వాటిని ఉపయోగించుకోలేని స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో పవన్ రాజకీయంగా పికప్ అవ్వడం కష్టమని తెలుస్తోంది. బీజేపీతో పొత్తులో ఉన్నా సరే ప్రయోజనం లేదు. జనసేన వల్ల బీజేపీకి కాస్త అడ్వాంటేజ్ అవుతుంది గానీ, జనసేనకు పావలా ఉపయోగం లేదు. అంటే వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన మళ్ళీ ఒకటి, రెండు సీట్లకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే పవన్ తన ప్లాన్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన టీడీపీకి దగ్గరవుతున్నారనే ప్రచారం ఎక్కువగా వస్తుంది.
పైగా టీడీపీకి కూడా పవన్ అవసరం చాలా ఉంది. వైసీపీని ఢీకొట్టాలంటే టీడీపీకి జనసేన సపోర్ట్ అవసరం చాలా ఉంది. పైగా చీలిపోకుండా ప్లస్ అవుతుంది. ఈ విషయాన్ని పవన్ కూడా గ్రహించారనే చెప్పొచ్చు. టీడీపీతో కలిస్తే కనీసం ఓ 10, 15 సీట్లు గెలుచుకునే అవకాశం దక్కుతుందని పవన్ యోచిస్తున్నారు. ఆ దిశగానే ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే పవన్ ఈ మధ్య చంద్రబాబుకు పలు అంశాల్లో సపోర్ట్‌గా నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అటు స్థానిక ఎన్నికల్లో కూడా టీడీపీ-జనసేనలు పలు చోట్ల పొత్తు పెట్టుకుని సత్తా చాటాయి.
అయితే పొత్తు అంశంలో అధికారికంగా పవన్ ఇప్పుడే క్లారిటీ ఇవ్వరని తెలుస్తోంది. ఎన్నికల ముందు పవన్…అధికారికంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని తెలుస్తోంది. ఈలోపు కీలక నియోజకవర్గాల్లో జనసేనని బలోపేతం చేసుకుంటారని తెలుస్తోంది. అంటే ఎన్నికల ముందే బాబుతో పవన్ కలుస్తారని చెప్పొచ్చు.