ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్

ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వైఎస్ ఆర్ సున్నా వడ్డీ పథకం కింద వరుసగా రెండో ఏడాది చెల్లింపులు చేసారు. రుణ ఖాతాల్లోకి ఆయన స్వయం సహాయక సంఘాలకు చెల్లింపులు చేసారు. బ్యాంకులతో మాట్లాడి మహిళల పై భారం తగ్గించామని జగన్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా సాధికారిత మా నినాదం కాదు విధానం అన్నారు ఆయన.

మహిళల ఆదాయం పెరిగే విధంగా చేయూతను ఇచ్చామని తెలిపారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా అమలు చేసామని అన్నారు. దీని ద్వారా కోటీ రెండు లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుంది. కరోనాతో రాష్ట్రానికి భారీగా ఆదాయం తగ్గిందని అన్నారు. అయినా సరే మాట నిలబెట్టుకున్నామని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మహిళలకు నైపుణ్యం పెంచుతున్నామని చెప్పారు జగన్.