2019 లో 40 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మరణించిన పుల్వామా దాడిపై గుజరాత్ లోని కేవాడియాలో ప్రధాని మోడీ మాట్లాడారు. “ పుల్వామా దాడిలో భద్రతా సిబ్బంది త్యాగం పట్ల కొంతమంది బాధపడలేదని… ఈ విషయాన్ని దేశం ఎప్పటికి మర్చిపోయే అవకాశం లేదని ఆయన అన్నారు. వారి వ్యక్తిగత లాభాల కోసం పుల్వామా దాడిపై “మురికి రాజకీయాలు” చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.
దేశ ప్రయోజనాల కోసం అలా చేయవద్దని అభ్యర్థించారు. పుల్వామా దాడిపై… పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కొన్ని తరువాత ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు దేశం తీవ్రంగా బాధపడుతున్నప్పుడు స్వార్థం మరియు అహంకారంతో మురికి రాజకీయాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి” అని మోడీ ఆరోపణలు చేసారు. ఉగ్రవాదంపై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.