ఏ లొల్లి లేదు.. అంద‌రం క‌లిసిమెలిసి బ‌తుకుతున్నాం : కేసీఆర్‌

-

తెలంగాణ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల సంబురం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో అందరికంటే ముందే ఉంది. గులాబీ బాస్ కేసీఆర్ అయితే.. కాళ్లకు చక్రలు కట్టుకున్నట్టుగానే నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు. నియోజకవర్గాల్లో నిర్వహిస్తోన్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ.. తనదైన ప్రసంగాలతో అటు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూనే.. ప్రజలను ఆకర్షిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. మరోవైపు.. ప్రతిపక్షాల మీద కూడా విమర్శలతో విరుచుకుపడుతున్నారు.తెలంగాణ రాష్ట్రం గ‌త ప‌దేండ్ల‌ నుంచి ప్ర‌శాంతంగా ఉంది. ఈ 100 ఏండ్ల‌లో ఈ ప‌దేండ్లే తెలంగాణ‌ ప్ర‌శాంతంగా ఉన్న‌ది. క‌ర్ఫ్యూ లేదు.. పంచాయితీ లేదు.. లొల్లి లేదు. మంచిగా ఉన్న‌ది.. అంద‌రం క‌లిసిమెలిసి బ‌తుకుతున్నాం. అదే కాంగ్రెస్ ఉన్న‌ప్పుడు తెల్లారితే క‌ర్ఫ్యూ, మ‌త‌క‌ల్లోలాలు, ఆ పంచాయితీల‌న్నీ ఎవ‌రు పెట్టారో ఆలోచించాలి. ఓటు అనేది ముఖ్యం.

UP CM comes and teaches lessons in Telangana when there is no food  guarantee in his own state: KCR slams Yogi

పాలిటిక్స్ కూడా చాలా ముఖ్యం. రాయి ఏందో.. ర‌త్నం ఏందో గుర్తు ప‌ట్టాలి. పార్టీల వైఖ‌రి కూడా చాలా ముఖ్యం అని కేసీఆర్ అన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్న మ‌నోహ‌ర్ రెడ్డి విద్యావేత్త‌. ఎమ్మెల్యే అయ్యాడు. నిస్వార్థంగా ప‌ని చేస్త‌డు. స్వార్థం లేదు. ఈ ప‌దేండ్ల‌లో ఒక్క రోజు కూడా వ్య‌క్తిగ‌త ప‌నుల గురించి అడ‌గ‌లేదు. పెద్ద‌ప‌ల్లి ప‌నులు.. మా ఆయ‌క‌ట్టుకు నీళ్లు వ‌స్త‌లేవు. మీద మోటార్లు పెడుతున్నారని నాకు చెప్పేవారు. ఇంకేద‌న్న చేయాలి ఓదెల శ్రీరాంపూర్‌కు నీల్లు పోవాల‌ని అడిగారు. రైతుల గురించి త‌ప‌న ప‌డిండు. ప‌దేండ్ల కింద‌నే రూ. 40 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ప్ర‌తి ఊరికి చెట్లు పంపిణీ చేసిండు. నియోజ‌క‌వ‌ర్గం బాగుప‌డాల‌ని ఆలోచిస్త‌డు. ఆయ‌న‌కు డ్రామాలు, నాట‌కాలు వేసుడు రాదు. ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడుతాడు. అర‌మ‌రిక‌లు లేకుండా నిజాయితీగా ఉంట‌డు. దొంగ ధ‌ర్నాలు, దొంగ‌ దీక్ష‌లు చేసుడు ఆయ‌న‌కు రాదు. సాదాసీదాగా మీ మ‌ధ్య ఉండే వ్య‌క్తి. మీ కోసం ప‌ని చేసే వ్య‌క్తి. ల‌క్ష ఓట్ల మెజార్టీతో మ‌నోహ‌ర్ రెడ్డిని గెలిపించాల‌ని కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news