అనంతపురంలో పోలీసుల హై అలెర్ట్… ఆ నియోజకవర్గంలో కంగారు కంగారు…!

ఉరవకొండ నియోజకవర్గ వైసీపీ లో మరోసారి వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఉరవకొండ పట్టణానికి మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి , మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వర్గీయులు చేరుకున్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో విశ్వేశ్వర్ రెడ్డి వర్గీయులు, మార్కెట్ యార్డ్ లో శివరాం రెడ్డి వర్గీయులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య వజ్రకరూరు మండలం ప్యాపిలి పవర్ ప్లాంట్‍ వివాదం చిచ్చు రేపింది.

ప్యాపిలి పవర్ ప్లాంట్‍లో ఉద్యోగం చేస్తున్న శివరామిరెడ్డి వర్గీయులను తొలగించాలంటూ యాజమాన్యంపై విశ్వేశ్వర్ రెడ్డి తనయుడు ప్రణయ్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. పవర్ ప్లాంట్‍లో యాజమాన్యంతో మంగళవారం మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గీయులు గొడవకు దిగారు. ఉరవకొండ పట్టణంలో ఇరువర్గాలు సంబంధించిన కార్యకర్తలు ఘర్షణ కు దిగే అవకాశం ఉన్న నేపధ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.