రేవంత్ రెడ్డి విషయంలో పక్కా ఆధారాలు…?

-

తెలంగాణా కాంగ్రెస్ యువనేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి విషయంలో తెరాస ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. తెలంగాణాలో రేవంత్ రెడ్డి దూకుడుకి పక్కా ఆధారాలతో తెరాస ప్రభుత్వం కళ్ళెం వేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్ళు తెరాస నేతలపై అడ్డగోలు ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు తన వంతు వచ్చే సరికి సైలెంట్ అయ్యారు.

ప్రస్తుతం ఆయనకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను తెరాస సేకరించింది. మంచిర్యాలలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసారు. దానికి సంబంధించిన జరిగిన అవకతవకలకు సంబంది౦చి కొంత సమాచారం అధికారులు సేకరించారు. అలాగే హైదరాబాద్ లో ఖరీదైన ప్రాంతంలో ఆయన బినామీల పేర్లతో కొన్ని ఇళ్ళను కొనుగోలు చేసారు అనే సమాచారం కూడా ప్రభుత్వం సేకరించింది.

వీటిపై పూర్తి స్తాయిలో విచారణ జరిపిన తర్వాత ఆయన్ను ఆ కేసుల్లో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో కూడా ఆయన ఖరీదైన భూములను కొనుగోలు చేసారని, దానికి సంబంధించి కొందరు బాధితులు కూడా ఉన్నారని గుర్తించారు. త్వరలోనే దీనిపై ఒక ప్రత్యేక బృందాన్ని నియమించి అధికారులు బాధితులను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని తెరాస వర్గాలు అంటున్నాయి.

ఇక తన నియోజకవర్గం అయిన కోడంగల్ లో కూడా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసారు. దీనికి ప్రభుత్వంలో కొందరు అధికారుల నుంచి కూడా ఆయనకు సహకారం వెళ్ళింది అని అధికారులు గుర్తించారు. త్వరలోనే ఆయన్ను దీనిపై విచారించే అవకాశం ఉందని, అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news