రాజధానితో రాజకీయం: లాభం ఎవరికి?

ఏపీలో రాజధాని అంశం చుట్టూనే రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. అసలు ఇప్పటికీ ఏపీకి రాజధాని ఏది అనేది తేలలేదు. ఎవరికి వారు రాజధాని అంశంతో రాజకీయంగా లబ్ది పొందడానికే చూస్తున్నారు తప్ప, ఒక రాజధాని ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ప్రజలకు మేలు చేయాలని మాత్రం చూస్తున్నట్లు కనిపించడం లేదు అసలు రాష్ట్ర విభజన జరిగాక…అమరావతిని చంద్రబాబు ప్రభుత్వం రాజధానిగా నిర్ణయించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా దీనికి అంగీకరించారు.

ysrcpandtdp
ysrcpandtdp

అయితే అమరావతి ద్వారా ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో తెలియదు గానీ, రాజకీయంగా టీడీపీకి బెనిఫిట్ అవుతుందనే ప్రచారం ఎక్కువ జరిగింది. అలాగే ఆర్ధికంగా ఆ పార్టీ బలపడుతుందని టాక్ వచ్చింది. ఇక ఎలాంటి ప్రచారం జరిగినా సరే చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు రాజధానికి ఒక రూపు తీసుకురాలేకపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్ వైపు మొగ్గు చూపారు. ఈయన అమరావతిని కొనసాగిస్తారని అంతా అనుకున్నారు.

కానీ అనూహ్యంగా మూడు రాజధానులని తీసుకొచ్చారు. పేరుకు ప్రాంతాల అభివృద్ధి పేరుతో మూడు రాజధానులని తీసుకొచ్చిన..దీని వల్ల రాజకీయ ప్రయోజనం ఎక్కువ ఉంటుందని ప్రచారం జరిగింది. అమరావతిలో కాస్త అటూ ఇటైన ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో వైసీపీకి మేలు జరుగుతుందని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే జగన్…మూడు రాజధానులు తీసుకొచ్చినట్లు కథనాలు వచ్చాయి. ఇటు టీడీపీ ఏమో అమరావతి వైపే ఉండిపోయింది. అమరావతి వైపు ఉంటే…తమకు కోస్తా ప్రాంతంలో బెనిఫిట్ అవుతుందనే కోణంలో టీడీపీ ఉండిపోయింది.

అయితే జగన్ ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గింది…మళ్ళీ కొత్త బిల్లు తీసుకొస్తామని చెబుతుంది. మళ్ళీ తీసుకొచ్చే బిల్లులో రాజకీయ ప్రయోజనాలే ఉంటాయని తెలుస్తోంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ రాజధాని విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేలా లేదు. రాజధానితో రాజకీయం చేస్తూ వైసీపీ, టీడీపీలు లబ్ది పొందాలని చూస్తుంటే….మధ్యలో రాజధాని లేక రాష్ట్రం నష్టపోతుంది. దీని వల్ల ప్రజలకే డ్యామేజ్ జరుగుతుంది.