గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ చాలా తక్కువగా నమోదు అయింది. మధ్యాహ్నం 2 వరకు కూడా 30 శాతం రావడానికి చాలా కష్టపడిన పరిస్థితి. 10 డివిజన్లలో మాత్రం 40 శాతం దాటింది. 37 డివిజన్ లలో కనీసం 10 శాతం కూడా పోలింగ్ జరగలేదు. అమీర్ పేటలో, తలాబ్ చంచలం, రేయీన్ బజార్ లో కనీసం ఒక్క శాతం కూడా ఓటింగ్ నమోదు కాలేదు. 0.80 శాతం లోపే ఉంది.
వనస్థలిపురం -29.03 %, హస్తినపురం – 30.08 %, నాగోల్ – 24.93 %, మన్సూరా బాద్-22.39%, హాయత్ నగర్ – 24.93 %, బీఎన్ రెడ్డి నగర్ – 24.54% నమోదు అయింది. చాలా కేంద్రాల్లో సిబ్బంది ఖాళీగా ఉన్నారు. ఓటు విషయంలో మాత్రం వృద్దులు, వికలాంగులు ఆదర్శంగా నిలిచారు.