ఏపీలో ఎమ్మెల్యేల‌పై పోస్టులు.. అస‌లు ఉన్నారా అంటూ కామెంట్లు

-

ఏపీలో ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయో అంద‌రికీ తెలిసిందే. రాష్ట్రంలో క‌రోనా విల‌య తాండ‌వం చేస్తోంది. ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల్లో సేవ‌లందించాల్సిన ఎమ్మెల్యేలు పెద్ద‌గా క‌నిపించ‌ట్లేద‌నేది ప్ర‌జ‌ల వాద‌న‌. చిత్తూరు జిల్లాలో అయితే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాత్ర‌మే బ‌య‌ట తిరుగుతున్నారు. కానీ వేరే ఎవ‌రూ క‌నిపించ‌ట్లేదు.

 

ఈ క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చాలామంది జీవ‌నోపాధి కోల్పోయారు. సంపాద‌న లేక నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల్సిన ఎమ్మెల్యేలు క‌రోనాకు భ‌య‌ప‌డి ఇండ్ల‌కే ప‌రిమితం అవుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు వాపోతున్నారు.

నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల ప‌రిస్థితుల‌ను ఎమ్మెల్యేలు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేద‌నేది నెటిజ‌న్ల విమ‌ర్శ‌. ఏదైనా ఉంటే కేవ‌లం వలంటీర్లు మాత్ర‌మే క‌నిపిస్తున్నార‌ని, దీంతో అస‌లు ఏపీలో ఎమ్మెల్యేలు ఉన్నారా? అనే సందేహాలను వ‌స్తున్నాయంటూ పోస్టులు పెడుతున్నారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడ `మా ఎమ్మెల్యే ఎక్కడ?` అనే కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికైనా ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల్లో ఉంటారో లేదో చూడాలి.

దీంతో కరీంనగర్ పర్యటనలో… ఆపరేషన్ హుజూరాబాద్ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. హుజూరాబాద్‌ను పూర్తిగా టీఆర్ఎస్ దిగ్బంధనం చేసేలా… ఈటలకు ఎక్కడా ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా..పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈటల రాజీనామాతో కేసీఆర్ కరీంనగర్ పర్యటన తర్వాత హుజురాబాద్ రాజకీయం మరింత రక్తి కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news