భర్త ప్రాణం కాపాడుకోవడానికే, ఎమ్మెల్సి టీడీపీకి షాక్ ఇచ్చారా…?

-

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇబ్బందిగా మారింది. అసలు మండలిలో ఏ విధంగా వ్యవహరించాలి అనుకుంటున్న తరుణంలోనే, ఇద్దరు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. ఉదయం మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు కి లేఖ కూడా పంపించారు. ఇక సాయంత్రం రూల్ 71 జరిగిన ఓటింగ్ లో భాగంగా,

ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు ఆ పార్టీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. మహిళా ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత, శివ నాద్ రెడ్డి ఇద్దరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతో ఒక్కసారిగా తెలుగుదేశం సభ్యులు ఖంగుతిన్నారు. అయితే వీరు అలా ఎందుకు చేశారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. శివనాగిరెడ్డి సంగతి పక్కనబెట్టి చూస్తే,

పోతుల సునీత భర్త సురేష్ మాజీ మంత్రి దివంగత పరిటాల రవీంద్ర బతికి ఉన్న సమయంలో ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అయితే పాత కక్షల కారణంగా ఆయనకు ప్రాణభయం ఉందని ప్రధానంగా వైసీపీలో కొంత మంది నేతలతో ఆయనకు ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయని, లేదని అందుకే ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఆమె ఓటు వేసారని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వాస్తవానికి ఆమెది జిల్లా అయినా పోతుల సురేష్ తెలుగుదేశంలో ఉండటం, గతంలో పరిటాల కుటుంబానికి కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఆమెకు తెలుగు మహిళ అధ్యక్ష పదవితో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోతారు అని ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో. జరుగుతుంది. రూల్ 71 పై చర్చ సందర్భంగా ఆమె ప్రభుత్వానికి అనుకూలంగా,

ఓటు వేయడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆమె ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆమెతో పాటుగా శివనాథ్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఇద్దరి పై అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్ కు తెలుగుదేశం పార్టీ సభ్యులు నోటీసులు కూడా ఇచ్చినట్టు సమాచారం. అయితే పార్టీ మారాలని ఆమె నిర్ణయం తీసుకోవడంతోనే టీడీపీ అనర్హత వేటు వేయాలని నోటీసు ఇచ్చినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news