ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన మొదటి నుంచి ప్రజాసేవలోనే ఉండటం అలాగే గురుకులాల కార్యదర్శిగా వాటిని ఎంతో అత్యున్నత స్థాయిలో డెవలప్ చేయడం లాంటివి ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఇమేజ్ ను సంపాదించి పెట్టాయి. ఇక ఆయనపై మొదటి నుంచి ఉన్నడిమాండ్ మేరకు ఆయన కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. కాగా ఆయన్ను తమ పార్టీలో చేర్చుకునేందకు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రయత్నించినా సాధ్యం కాలేదనే చెప్పాలి.
ఇక ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారని ఊహాగానాలు వినిపించినా కూడా ఆయన మాత్రం బహుజన పార్టీగా ముద్ర వేసుకున్న బీఎస్పీలోకి తన ప్రయాణం సాగించారు. కాగా ప్రవీణ్ కుమార్ కేవలం ఆయన బీఎస్పీలో చేరిన రోజు తప్ప మళ్లీ పెద్దగా బయట కనిపించట్లేదు. ఒక్క మీడియా ముందుకు కూడా రాలేదు. ఆయన ఐపీఎస్‌కు వీఆర్ ఎస్ ఇచ్చిన తర్వాత వచ్చిన హైప్ మళ్లీ రాలేదనే చెప్పాలి. అన్ని పార్టీలు మంచి జోరు మీద రాజకీయాలు చేస్తుంటే ఆయన మాత్రం అలాంటివేవీ పట్టించుకోకుండా సైలెంట్ అయిపోయారు.
అయితే ఆయన మాత్రం సైలెంట్‌గానే తన పనులు చేసకుంటూ పోతున్నారని తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ స్వేరోస్ లో ఉన్నప్పుడు తనకు పరిచయం ఉన్న వారందరినీ ఇప్పుడు బీఎస్పీలోకి తీసుకొస్తున్నారంట. ఇక ఇప్పటికే రాష్ట్రంలో మంచి ఇమేజ్ ఉన్న వారందరితో చర్చలు కూడా సాగిస్తున్నారని తెలుస్తోంది. ఇక రీసెం ట్ గానే స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా బీఎస్పీ గూటికి వచ్చారు. త్వరలోనే తన టీమ్‌లను రెడీ చేసుకుని యా్క్టివ్ పాలిటిక్స్‌లోకి దిగుతారని తెలుస్తోంది.