రంగుల రాజకీయం…జగన్ టూ కేసీఆర్..టీఆర్ఎస్‌కు షాక్ తప్పదా!

-

తెలుగు రాష్ట్రాల్లో రంగుల రాజకీయం ఎక్కువైపోయినట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీలు..తమ పార్టీ రంగులని ప్రభుత్వ భవనాలకు వేసుకుంటూ సరికొత్త రాజకీయానికి తెరలేపుతున్నాయి. ఏపీలో అధికారంలోకి ఉన్న వైసీపీ… మొదట్లో ప్రభుత్వ భవనాలకు… తమ పార్టీ రంగులని వేసిన విషయం తెలిసిందే. రంగుల వేయడానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా పంచాయితీ భవనాలకు, గ్రామ/వార్డు సచివాలయాలకు, స్కూల్స్, వాటర్ ట్యాంకులకు, రోడ్ల డివైడర్లకు, కరెంట్ స్తంభాలకు ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ ప్రభుత్వం ప్రతిదాన్ని రంగులతో నింపేసింది. ఆఖరికి శ్మశానలు కూడా వదల్లేదు.

kcr-jagan
kcr-jagan

ఇక రంగులు వేయడానికి డబ్బులు కూడా బాగానే ఖర్చు పెట్టింది. అంటే తమ పార్టీ రంగులు, ప్రజలకు ఎప్పుడు గుర్తు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పని చేసింది. కానీ ఇదే రివర్స్ అయ్యి జగన్ ప్రభుత్వానికి నెగిటివ్ అయింది. అసలు ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడమనేది కరెక్ట్ కాదు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం..ప్రభుత్వ భవనాలకు అంటూ ఓ కలర్ కోడ్ ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్లింది.

దీంతో ఈ రంగుల అంశంపై ప్రతిపక్ష టీడీపీ కోర్టుకెళ్లింది. ఇక హైకోర్టులో అనేక సార్లు మొట్టికాయలు వేశాక జగన్ ప్రభుత్వం రంగులని తీసింది. ఇక ప్రభుత్వ భవనాలకు తగ్గట్టుగా రంగులు వేసింది. ఇలా రంగులు వేసి, తీసి, మళ్ళీ వేరే రంగులు వేయడానికి డబ్బులు గట్టిగానే ఖర్చు అయ్యాయి.  ఇలా రంగుల విషయంలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది.

అయితే తెలంగాణలో కూడా రంగుల రాజకీయ మొదలైంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్…ప్రభుత్వ భవనాలకు గులాబీ రంగులు వేసేస్తుంది. డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి శ్మశానాల దాక.. స్కూళ్ల నుంచి ఆసుపత్రులు దాక.. ప్రభుత్వ ఆఫీసుల నుంచి గెస్ట్ హౌస్ల దాక..ఇలా ప్రతిదాన్ని గులాబీ రంగుతో నింపేస్తున్నారు. కొత్తగా కట్టే పంచాయతీ ఆఫీసులకు, మండల పరిషత్ ఆఫీసులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లకు, కాలేజీలకు గులాబీ రంగు పడిపోతుంది.

ఇలా ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నారు. ఇక ఏపీలో మాదిరిగా తెలంగాణలో ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక కోర్టుకు వెళితే రంగుల అంశంలో కేసీఆర్ ప్రభుత్వానికి కూడా షాక్ తగలడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news