ప్ర‌వీణ్‌కుమార్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న యూత్‌.. రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతారా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో ఒక ఉత్తుంగ త‌రంగంలా దూసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌ కుమార్‌ (praveen kumar). ఈయ‌న పేరు అంటే పెద్ద‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఆయ‌న ఐపీఎస్ ఆఫీస‌ర్ గా ఉన్న‌ప్ప‌టి నుంచే గురుకులాల కార్య‌ద‌ర్శిగా అంద‌రికీ సుప‌రిచిత‌య్యారు. స్వేరోస్ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు ప్ర‌వీణ్ కుమార్‌. ఇప్పుడు ఆయ‌న వీఆర్ ఎస్ తీసుకున్నప్ప‌టి నుంచి రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

Praveen Kumar_IPS

ఇక ఆయ‌న ఏ పార్టీలో చేర‌తార‌నే దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. అయితే ఆయ‌న బీఎస్పీలో చేర‌తార‌ని, ఇప్ప‌టికే బీఎస్పీ అధినేత్రి మాయావతి దీనిపై ప్ర‌క‌ట‌న కూడా చేసిందంటే జాతీయ మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. కాగా ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌నే స‌మాచారం బ‌య‌ట‌కు రావ‌డంతో యూత్‌లో విప‌రీతంగా క్రేజ్ పెరిగిపోయింది.

ఆయ‌న మాట్లాడే విధానం, యూత్ కోసం ఏమేం చేయాలో చెప్ప‌డం, బ‌హుజ‌న నినాదం ఇప్ప‌టికే గురుకులాల‌తో ఆయ‌న సృష్టించిన అద్భుతాలు ఇలా అన్ని కూడా ఫాలోయింగ్ ముఖ్య‌ కారణం. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో కూడా ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావాలంటే బ‌హుజ‌నుల‌కు అధికారం రావాలంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. పార్టీలో జాయిన్ కాక‌ముందే ఆయ‌న‌కు ఇంతగా ఇమేజ్ వ‌స్తుంటే ఇంక పార్టీలో చేరి ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తారో చూడాలి.