పుంగనూరు – మాచర్ల తమ్ముళ్లతో డేంజర్!

-

పుంగనూరు-మాచర్ల నియోజకవర్గాల పేరు చెబితే చాలు…ఇవి వైసీపీ కంచుకోటలు అని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డాలు అని అందరికీ గుర్తొస్తాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇక్కడ గెలిచేది వైసీపీనే అనే పరిస్తితి. అలాగే రాష్ట్రంలో రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ రెండు చోట్ల వైసీపీ సత్తా చాటుతుంది. అంటే రెండు నియోజకవర్గాల్లో వైసీపీ తప్ప…మరొక పార్టీ గెలవదు.

మరి అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు చాలా కసితో పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ఆ రెండు చోట్ల టీడీపీ శ్రేణులు పెద్దగా యాక్టివ్ గా పనిచేయలేదు. కానీ ఇప్పుడు కేసులు పెట్టినా సరే వెనక్కి తగ్గేదెలే అన్నట్లు తెలుగు తమ్ముళ్ళు పనిచేస్తున్నారు. ఈ రెండు చోట్ల ఎలాగైనా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు. ఇలా తెలుగు తమ్ముళ్లలో కసి పెరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. చాలా ఏళ్ల పాటు అక్కడ గెలవకపోవడం, అలాగే ఇప్పటివరకు టీడీపీ కార్యకర్తలని నడిపించే సరైన నాయకులు లేరు. కానీ ఇప్పుడు ఫైర్ బ్రాండ్ నాయకులు వచ్చారు.

ఎప్పుడైతే పుంగనూరులో టీడీపీ ఇంచార్జ్‌గా చల్లా రామచంద్రారెడ్డి, మాచర్లలో ఇంచార్జ్‌గా జూలకంటి బ్రహ్మానందరెడ్డి వచ్చాక…సీన్ మారిపోయింది. నాయకులు దూకుడుగా పనిచేస్తూ ఉండటంతో..రెండు చోట్ల టీడీపీ తమ్ముళ్ళు యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇప్పటికీ ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీదే లీడ్ అని తాజా సర్వేల్లో తేలింది. మళ్ళీ మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో గెలుపు వైసీపీదే అని సర్వేలు వచ్చాయి.

అయినా సరే తమ్ముళ్ళు నిరుత్సాహపడకుండా పనిచేస్తున్నారు…ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది…దీంతో ఇంకా బలపడేలా తమ్ముళ్ళు ముందుకెళుతున్నారు. వైసీపీపై ఉన్న వ్యతిరేకతని క్యాస్ చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే పుంగనూరుతో పోలిస్తే మాచర్లలో టీడీపీకి కాస్త ప్లస్ ఉంటుంది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఓటర్లని తిప్పుకుంటే మాచర్లలో గెలిచే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికైతే ఇటు మాచర్ల గాని, అటు పుంగనూరులో గాని తెలుగు తమ్ముళ్లతో వైసీపీకి డేంజర్ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news