పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం… అవినీతి నిరోధానికి హెల్ప్ లైన్, ఏకంగా తన నెంబరే ఇచ్చి…

-

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన మార్క్ చాటుకుంటున్నాడు. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్ ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు కీలక నిర్ణయం తీసుకుంటామని..కాసేపట్లో విషయం చెబుతానన్న సీఎం మాన్ దాన్ని బయటపెట్టాడు. రాష్ట్రంలో అవినీతిని అరికట్టేందుకు నడుంబిగించారు. అవినీతి నిరోధానికి హెల్ప్ లైన్ నెంబర్ ను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఏకంగా తన వాట్సాప్ నెంబరే ఇచ్చి ఫిర్యాదులు చేయవచ్చని వెల్లడించారు. ఎవరైనా మీ నుండి లంచం డిమాండ్ చేస్తే, తిరస్కరించవద్దు, వీడియో/ఆడియో రికార్డింగ్ చేసి హెల్ప్ లైన్ నంబర్‌కు పంపండి. నా కార్యాలయం దర్యాప్తు చేస్తుంది, ఏ దోషిని విడిచిపెట్టదని సీఎం భగవంత్ మాన్ హెచ్చరించారు. మార్చి 23 షహీన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నెంబర్ ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఇదే విషయంపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కూడా స్పందించారు. ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే వ్యతిరేఖించకండి.. దాన్ని వీడియోలు, ఆడియో రికార్డ్ చేసి హెల్ప్ లైన్ నెంబర్ కు పంపించండి అంటూ కోరాడు.

Read more RELATED
Recommended to you

Latest news