పోలీసులపైకి కుక్కలను వదిలిన వైసీపీ నేత పీవీపీ.!

వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 14 లో తాజాగా ప్రేమ్ పర్వత్ విల్లస్ పేరిట నిర్మాణాలు చేపట్టారు, కాగా ఆ విల్లాలో ఒక దానిని విక్రమ్ కైలాస్ అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం కొనుగోలు చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడం.. విక్రమ్ పై పీవీపీ అనుచరులు దాడి చేయడం.. అతనిపై కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే.

అయితే అప్పటి నుంచి ఆయన విచారణకు హాజరుకావడం లేదు. దీంతో ఆయన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులపై పీవీపీ తన కుక్కలను వదిలారు. దీంతో, భయంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం  చేశారు. దీంతో పీవీపీపై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు.