రజనీ ఫ్యాన్స్ ఆందోళన వెనుక ప్యూహం ఇదేనా

Join Our COmmunity

బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే ! సినిమాలో హిట్‌ అయిన ఈ డైలాగ్‌ను.. రియల్‌ లైఫ్‌లో నిలబెట్టుకోలేకపోయారు రజనీకాంత్‌. రాజకీయాల్లోకి వస్తానని చెప్పి.. ఇప్పుడు అనారోగ్య కారణాలతో యూటర్న్‌ తీసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్‌.. ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అసలు వారి ఆందోళనల వెనుక ప్యూహం ఏంటి ?

ఒకే ఒక్కడులో సీన్‌.. నిన్న చెన్నైలో కనిపించింది. సినిమాలో హీరోను రాజకీయాల్లోకి రమ్మంటూ ఓ దివ్యాంగుడు కోరిన సీన్‌… రజనీ ఇంటి ముందు కన్పించింది. రజనీ ఇంటి వరకూ నిర్వహించిన ర్యాలీలో దివ్యాంగుడు..రజనీ రాజకీయాల్లోకి రమ్మని కోరాడు. ఒకే ఒక్కడులో ఈ సీన్‌ తర్వాత అర్జున్‌ పాలిటిక్స్‌లోకి వచ్చి సీఎం అవుతారు. కానీ, ఇప్పుడు రజనీకాంత్‌.. పొలిటికల్‌ ఎంట్రీపై వెనక్కి తగ్గారు. అందుకే చెన్నైలో రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ భారీ ప్రదర్శన నిర్వహించారు.

డిసెంబర్‌ 31న పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని చెప్పిన రజినీకాంత్‌, సంక్రాంతికి పార్టీని స్టార్ట్‌ చేసి ఈ ఏడాది వేసవిలో జరిగే అసెంబ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అయితే అనుకోకుండా, హై బీపీ రావడంతో హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. రజినీకాంత్‌ టెన్షన్‌ పెట్టే పరిస్థితులకు దూరంగా ఉండాలని డాక్టర్స్‌ సూచించడంతో.. సూపర్‌స్టార్‌ తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే రజినీకాంత్‌ రాజకీయాల్లోకి ప్రవేశించకుండానే తప్పుకోవడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

చెన్నై పోలీసులు కేవలం 200 మందికి మాత్రమే గంట పాటు నిరసనకు అనుమతిచ్చారు. అయితే దాదాపు 2వేల మందికి పైగా రజినీ అభిమానులు చేరుకొని.. రెండున్నర గంటలపాటు నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమోగించారు. నిరసనలకు దిగవద్దని, అభిమాన హీరో నిర్ణయాన్ని గౌరవించాలని రజినీ మక్కల్ మండ్రం అభిమానులకు విన్నవించినప్పటికీ ఫ్యాన్స్ పట్టించుకోవడంలేదు.

ఫ్యాన్స్ మాత్రం రాజనీ రాజకీయాల్లోకి రాకుండా ఏదో బలమైన రాజకీయ శక్తి తెర వెనుక పనిచేసిందన్న అనుమానంతో ఉన్నారు.రజనీ రాజకీయాల్లోకి రాకుండా ఒత్తిడి చేశారన్నది వారి సందేహం.రజనీ పై మరోసారి గట్టిగా ఒత్తిడి తెస్తే మనసు మార్చుకుంటాడేమో అన్న అభిప్రాయంతో ఫ్యాన్స్ భారీగానే ఆందోళనలు చేపట్టారు.

అభిమానుల ఆందోళన పై లేఖ విడుదల చేశారు రజనీకాంత్.ఆరోగ్య పరిస్థితుల వలన నేను రాజకీయాల్లోకి రానని చెప్పాను.కానీ ఇప్పుడు నా నిర్ణయం మార్చుకోమని నాపై ఒత్తిడి చేయవద్దు అని రజినీ కోరారు.రాజకీయాల్లోకి రాకపోవడానికి గల కారణాలను నేను వివరంగా చెప్పాను. ఇప్పుడు ఇలాంటి ఆందోళనలు చేసి నన్ను బాధపెట్టొద్దు.నా నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ ఒత్తిడి తీసుకురావొద్దు.నేనూ మీ ఆందోళనతో చాలా బాధపడ్డాను.ఇప్పటికైన నన్ను అర్థం చేసుకోండన్నారు రజనీ. ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి

TOP STORIES

ఫౌ-జి గేమ్‌కు భారీ స్పంద‌న‌.. తొలి రోజు ఎంత మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే..?

ఎన్‌కోర్ గేమ్స్ డెవ‌ల‌ప్ చేసిన ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (ఫౌ-జి) గేమ్ గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గేమింగ్ ప్రియుల‌కు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం...
manalokam telugu latest news