రామగుండంలో రచ్చ..కారులో రెబల్స్..కాంగ్రెస్‌లో పోరు.!

-

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో అధికార బి‌ఆర్‌ఎస్ లో ఆధిపత్య పోరు భగ్గుమంది. అక్కడ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొందరు బి‌ఆర్‌ఎస్ నేతలు పనిచేస్తున్నారని చెప్పి..వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని డిసైడ్ అయ్యారు. దీంతో రెబల్స్ ఎమ్మెల్యేపై రగిలిపోతున్నారు. ఈ పంచాయితీ అధిష్టానం వద్దే తేల్చుకుంటామని అంటున్నారు. ఇక అటు కాంగ్రెస్ లో కూడా సీటు కోసం పోరు నడుస్తుంది. ఇలా రెండు పార్టీల్లో రచ్చ జరుగుతుంది.

వాస్తవానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మొదట నుంచి బి‌ఆర్‌ఎస్  పార్టీలో పనిచేస్తూ వస్తున్నారు. అయితే యువ నాయకుడుగా మొదట టి‌డి‌పిలో పనిచేశారు. 2001లో కే‌సి‌ఆర్ పార్టీ పెట్టడంతో ఇటు వచ్చేశారు. అక్కడ నుంచి పార్టీలో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇక 2009లో ఆయన బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి రామగుండం బరిలో ఓడిపోయారు. అప్పుడు ఇండిపెండెంట్ గా నిలబడి సోమారాపు సత్యనారాయణ గెలిచారు..నెక్స్ట్ ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లారు.

రాష్ట్ర విభజనతో బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఈ క్రమంలో కోరుకంటి 2014 ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేశారు. కానీ విజయం సోమారపుని వరించింది. ఇక 2018లో అలాగే పోటీ నడిచింది. కానీ ఈ సారి విజయం కోరుకంటి వైపు వచ్చింది. వెంటనే ఆయన బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చేశారు. ఎమ్మెల్యేగా బాగానే పనిచేస్తున్నారు. కాకపోతే కొందరు బి‌ఆర్‌ఎస్ నేతలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి..జెడ్పీటీసీ సహ ఆరుగురు బి‌ఆర్‌ఎస్ నేతలపై వేటు వేయించాలని చందర్ డిసైడ్ అయ్యారు.

అయితే వారు..ఈ విషయం అధిష్టానం వద్ద తేల్చుకుంటామని అంటున్నారు. ఆ నేతలతో కొంత ఎమ్మెల్యేపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఓ వర్గం వ్యతిరేకంగా మారింది. అటు కాంగ్రెస్ లో సీటు కోసం ఇంచార్జ్ మక్కన్ సింగ్, జనక్ ప్రసాద్ పోటీ పడుతున్నారు. ఇలా రెండు పార్టీల్లో పోరు నడుస్తుంది. ఈ పోరు ఎవరికి ఎక్కువ నష్టం చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news