కమలం టార్గెట్‌గా కాంగ్రెస్ సంచలనం..విపక్ష కూటమికి బూస్ట్..!

-

దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకే రోజు ఎన్డీయే పక్షం, అటు యూపీఏ పక్షం సమావేశం జరగడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ తో సహ 26 పార్టీలు విపక్ష కూటమిగా ఏర్పడి..బెంగళూరులో ఐక్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. కేవలం బి‌జే‌పిని గద్దె దించడమే ఆ పార్టీల టార్గెట్. ఇక విపక్షాలకు పోటీగా బి‌జే‌పి సైతం..తమ మిత్రపక్షాలతో ఎన్డీయే సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీ వేదికగా ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బి‌జే‌పితో సహ 38 పార్టీల వర్కౌ హాజరవుతాయని తెలుస్తుంది.

ఇలా ఎవరికి అధికార, ప్రతిపక్షాల పార్టీల వారు కూటములుగా ఏర్పడి..రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. అయితే విపక్షాల కూటమిలో అతి పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్..బి‌జే‌పిని దెబ్బకొట్టడం కోసం సంచనల నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పీఠంపై ఆశ లేద్నటు.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సంచలన ప్రకటన చేశారు.

మీటింగ్ జరుగుతున్నప్పుడే ఖర్గే ఈ ప్రకటన చేశారు. ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఆసక్తి లేదని, తమ తాపత్రయం అధికారం సాధించడం కోసం అసలే కాదని,  ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని రక్షించేందుకే తమ ప్రయత్నం అంతా అని ఖర్గే అన్నారు.

అయితే ఇప్పటికే విపక్షాల కూటమి చీలిపోతుందని విమర్శలు వస్తున్నాయి. వారంతా అవినీతి పరులు అని, అధికారం కోసమే పాకులాడుతున్నారని మోదీ విమర్శలు చేశారు. ఇక ప్రధాని పదవి కోసం విపక్ష కూటమిలో చీలిక వస్తుందని, కాంగ్రెస్ పార్టీ ప్రధాని పదవి వదులుకోదు కాబట్టి రచ్చ జరుగుతుందని భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ ప్రధాని పదవి త్యాగం చేసింది. దీంతో విపక్షాలకు కాస్త బూస్ట్ ఇచ్చినట్లు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news