రాష్ట్ర ఎన్నికల కమీషనర్… నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ లేఖ రాస్తున్నట్టు వచ్చిన వార్తలపై కేంద్ర హోం శాఖ స్పందించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆ లేఖ రాసింది కమీషనర్ అనేది మేము స్పష్టతకు వచ్చామని కిషన్ రెడ్డి మీడియాకు వివరించారు. అందుకే కేంద్ర బలగాల పహారాతో ఆయనకు భద్రత కల్పించామని ఆయన చెప్పారు.
ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి భద్రత ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. హోం శాఖ కార్యదర్శికి ఆ లేఖ అందింది అన్నారు. కేంద్రం సూచనల మేరకే తాము ఈ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పరిధిలోని అంశం అయినా కేంద్ర౦ అవసరం అయితే జోక్యం చేసుకుంటుందని ఆయన అన్నారు. ఈ లేఖ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఇది పక్కన పెడితే, ఈ లేఖ తాను రాయలేదు అని రమేష్ కుమార్ మీడియాకు వివరించినా ఆయనే రాసారనే విషయం స్పష్టంగా అర్ధమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆయన భయపడుతున్నారని అందుకే కేంద్రం కూడా ఆయన భద్రత పెంచింది అంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించాలి అంటే కేంద్ర బలగాల పహారా అవసరమని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.