రంజిత్ కేసీఆర్ పరువు నిలబెడతాడా ?

-

దుబ్బాక లో జరిగిన ఉప ఎన్నికలలో పరువు పోగొట్టుకున్న తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ గ్రేటర్ లో పొటాపోటిగా బీజేపీ కంటే కొన్ని స్థానాలను ఎక్కువగా దక్కించుకుంది. అయితే క్రమక్రమంగా బిజెపి బలపడుతున్న తీరు టిఆర్ఎస్ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆందోళన ఇలా ఉండగానే త్వరలోనే నాగార్జునసాగర్ లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో , టిఆర్ఎస్ అందరికంటే ముందుగానే అలర్ట్ అవుతోంది. ఇక్కడ అ ఎన్నికలు జరిగితే ఈ స్థానాన్ని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు బిజెపి ఇప్పటి నుంచే వ్యూహం రచిస్తోంది. దీని కోసం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత , ఇక్కడ ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానా రెడ్డి ని బిజెపి లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అవసరమైతే జానారెడ్డి కి గవర్నర్ పదవి, ఆయన కుమారుడుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు సైతం సిద్ధం అవుతోంది.

ఇప్పటి వరకు జానారెడ్డి ఈ విషయంలో ఏ క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఆయన గాని, ఆయన కుమారుడు గాని బీజేపీ నుంచో

 లేక కాంగ్రెస్ నుంచి కానీ పోటీ చేస్తే ఆయన ను దీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కోసం టిఆర్ఎస్ వెతుకులాట మొదలు పెట్టింది. దుబ్బాక లో రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇచ్చినట్టుగా,  నాగార్జునసాగర్ లో నోముల నరసింహ కుటుంబానికి టికెట్ ఇచ్చేందుకు టిఆర్ఎస్ సిద్ధంగా లేదు. దీనికోసమే బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు డిసైడ్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామమూర్తి యాదవ్ మనవడు టిఆర్ఎస్ యువనేత మన్యం రంజిత్ యాదవ్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోటీకి దింపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట.
స్థానికంగా రామ్మూర్తి యాదవ్ కు  నియోజకవర్గంలో మంచి పేరు ఉండడంతో పాటు,  యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం,  రంజిత్ యూత్ మంచి ఫాలోయింగ్ ఉండడం ఇవన్నీ తమకు కలిసి వస్తాయని లెక్కల్లో కెసిఆర్ ఉన్నారు. టిఆర్ఎస్ లోని మెజారిటీ నాయకులు రంజిత్ యాదవ్ అయితేనే గట్టిపోటీ ఇవ్వగలరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడంతో కేసీఆర్ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే , గడ్డంపల్లి రవీందర్ రెడ్డి అనే ఓ ఎన్నారై సైతం టిఆర్ఎస్ తరపున ఈ స్థానం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news