మొన్న సీఎం కేసీఆర్ ఎన్నడూ లేనిది ఆస్పత్రుల బాట పట్టారు. మొదటిరోజు గాంధీ ఆస్పత్రిని, ఆ తర్వాతి రోజు ఎంజీఎంను పరిశీలించారు. అయితే ఇక్కడ కేసీఆర్ వరంగల్ వెళ్లింది కేవలం ఎంజీఎం పరిశీలనకు మాత్రమే కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడుతన్న రాజకీయాల ప్రకారం హుజూరాబాద్ చుట్టూ తెలంగాణ నేతల కన్ను ఉంది.
ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేశాక ఆ ప్రాంతంలో టీఆర్ ఎస్ పట్టు ఎలా ఉంది? నాయకులు ఎటువైపు నిలుస్తున్నారనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగానే హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్ పట్టు గురించి తెలుసుకునేందుకే కేసీఆర్ వెళ్లారని తెలుస్తోంది.
ఎంజీఎం పర్యటన తర్వాత ఆయన నేరుగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లారు. ఒకవేళ హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వస్తే లక్ష్మీకాంతరావు కుటుంబీకులే పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న టైమ్‌లో కేసీఆర్ వారి ఇంటికెళ్లడం దీనికి బలాన్ని చేకూర్చనట్టయింది. కెప్టెన్‌తో హుజూరాబాద్ రాజకీయాల గురించి, భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించినట్టు సమాచారం.