సెలవులు ప్రకటించిన తెలంగాణ విద్యాశాఖ!

తెలంగాణ రాష్ట్ర పాఠశాలల అకాడమిక్ క్యాలెండర్ ను రాష్ట్ర విద్యాశాఖ కాసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈ ఏడాది మొత్తం 213 పని దినాలు ఉండనున్నాయి. ఇక ఏప్రిల్ 23 వ తేదీ 2022 చివరి పని దినం కానుంది. అలాగే… దసరా సెలవులు అక్టోబర్ 6 నుండి 17 వరకు (12 రోజులు) ఉండున్నాయి.

Schools starts from today in ap
Schools starts from today in ap

ఇక 22 డిసెంబర్ నుండి 28 డిసెంబర్ వరకు (7 రోజులు) మిషనరీ స్కూల్స్ కి క్రిస్మస్ సెలవులు ఉండనున్నాయి. జనవరి 11 నుండి 16 వరకు (7 రోజులు) మిషనరీ స్కూల్స్ మినహా సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. మార్చి, ఏప్రిల్ లో పదవ తరగతి పరీక్షలు జరుగనున్నాయి.
ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. కాగా… కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గిన నేపథ్యంలో ఇటీవలే తెలంగాణ రాష్ట్రం లో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్‌ 1 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి.ఈ నేపథ్యం లో తాజాగా పాఠశాలల అకాడమిక్ క్యాలెండర్ ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది.