కోకాపేట వ్యవహారంలో తీస్తాడట తాట… రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌!

-

రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రేటర్ హైదరాబాద్ శివారులో ఉన్న కోకాపేట భూములను వేలం వేసింది. ఈ భూములకు అత్యధికంగా అందరూ ఆశ్చర్యపోయే రీతిలో ధర పలికింది. రికార్డు స్థాయిలో ధర పలికిన ఈ భూముల వ్యవహారంలో గోల్ మాల్ జరిగిందని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఆరోపించారు. ఎకరం 60 కోట్ల విలువ చేసే భూములను కేవలం 30, 40 కోట్లకే అమ్మడం సమంజసం కాదన్నారు. కాగా ఈ వేలంలో పాల్గొన్న అందరూ కేసీఆర్ కు దగ్గరి బంధువులేనని విమర్శించారు. త్వరలో ఈ భూముల విషయంలో జరిగిన గోల్ మాల్ బయటపెడతానన్నారు.

 

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

కాగా ఎంత మంది ఎన్ని రకాలుగా వ్యతిరేకించినా… భూముల అమ్మకాన్ని అడ్డుకుంటామని హెచ్చరించినా… ప్రభుత్వం చివరికి భూములను వేలం వేసే తీరింది. అయితే ఈ వేలంలో ప్రభుత్వానికి కళ్లు చెదిరే రీతిలో కాసులు కురిశాయి. దీంతో కొంత మంది ఈ భూముల్లో గోల్ మాల్ జరిగిందేమో అని అనుమానిస్తున్నారు. టీపసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు.

ప్రజల భూములను అన్యాయంగా దోచుకున్న కేసీఆర్ బంధువులు ఎక్కడ దాక్కున్నా తాను వదిలిపెట్టనని శపథం చేశాడు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం పై కూడా ఆయన విమర్శల బాణాలు గుప్పించారు. పనిలో పనిగా ఐజీ ప్రభాకర్ రావుపై కూడా ఆరోపణలు చేశాడు. ఐజీ తమ ఫోన్ కాల్స్ను ట్యాప్ చేస్తున్నాడని ఆరోపించారు. తాము ఈ రోజు అపాయింట్ మెంట్ కోరగానే గవర్నర్ పుదుచ్చేరికి వెళ్లడం సరికాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news