ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఫిక్స్ అయిపోయారా?

-

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ( Revanth Reddy )  , అధికార టీఆర్ఎస్‌కు తన సత్తా ఏంటో చూపించాలని సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకే వరుసపెట్టి టీఆర్ఎస్‌ని టార్గెట్ చేసుకుని రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ ముందుకెళుతున్నారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటాలు మొదలుపెట్టారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరిని తప్పు బట్టారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

అలాగే ఇంకా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాన్ని ఉదృతం చేశారు. వరుసపెట్టి ప్రజల్లో ఉంటూ పోరాటాలు చేయడానికి రేవంత్ సన్నద్ధమయ్యారు. ఇదే పార్టీకి కలిసొస్తుందని రేవంత్ భావిస్తున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్‌ని ఎదురుకోవాలంటే గత పీసీసీ అధ్యక్షులు మాదిరిగా సైలెంట్‌గా ఉంటూ, పార్టీ సమావేశాల్లో మాత్రమే పాల్గొనడం చేయకూడదని రేవంత్ భావిస్తున్నారు.

నిత్యం ప్రజల్లో ఉంటేనే కాంగ్రెస్‌కు కొత్త ఊపు వస్తుందని అనుకుంటున్నారు. అందుకే రేవంత్ వరుసపెట్టి ప్రజల సమస్యలపై కొట్లాడటానికి సిద్ధమయ్యారు. రాబోయే రోజుల్లో మరింతగా దూకుడుగా ఉండాలని చూస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు పోరాటాలు చేయాలనే విధంగా పనిచేస్తున్నారు. ఇదే కాకుండా రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా చేస్తారని తెలుస్తోంది. రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తే సక్సెస్ అవుతారనే ఫార్ములా వైఎస్సార్, చంద్రబాబు, జగన్‌ల విషయంలో నిజమైన విషయం తెలిసిందే.

అందుకే రేవంత్ రెడ్డి కూడా అదే పాదయాత్ర ద్వారా జనాలకు దగ్గరయ్యి, నెక్స్ట్ కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అయితే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో రేవంత్, సంజయ్‌కు మించేలా పాదయాత్ర ప్లాన్ చేసుకుంటారని తెలుస్తోంది. అంటే ఎన్నికల వచ్చే వరకు ప్రజల్లోనే ఉండాలని రేవంత్ ఫిక్స్ అయిపోయారు. చూడాలి మరి రేవంత్ ప్లాన్స్ ఎలా సక్సెస్ అవుతాయో?

Read more RELATED
Recommended to you

Latest news